Friday, December 3, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

మన చుట్టూ ఎంత మంది
ఉన్నా సరే..
మన ఆలోచనలు మాత్రం
మనకు ఇష్టమైన వారి చుట్టూ
తిరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళ స్థానం
మన మనసులో కాబట్టి..!!

పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది.
రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చుపెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది.


"మనం సమాధానంలో
భాగం కావాలి కానీ
సమస్యలో భాగం కాకూడదు."

జీవితంలో ప్రతి కష్టానికి
ఒక కారణం ఉంటుంది.
కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి
ఒక అవకాశం ఉంటుంది.

చేసిన తప్పుకు
క్షమాపణ అడిగేవాడు
ధైర్యవంతుడు.
ఎదుటివారి తప్పును
క్షమించగలిగిన వాడు
బలవంతుడు".

అడిగితే ఇచ్చే దానిలో
ఆనందం ఉంటుంది.
అడగకుండా ఇచ్చే దానిలో
ప్రేమ ఉంటుంది.
పదే పదే..
అడిగి తీసుకునే దానిలో
కష్టం ఉంటుంది.
అది బంధమయినా..
వస్తువయినా..!!

బాల్యం విలువ
అది గడచిపోతే కానీ
తెలియదు.
యవ్వనంలో ఉన్న శక్తి
అది ఉడిగిపోయేదాకా
తెలియదు.
సంసార జీవితంలో మన గురించి
ఆలోచించే సమయం దొరకదు.
జీవితం గురించి
అర్థం చేసుకోవాలంటే
ఈ జీవితం సరిపోదు…!!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment