Monday, December 13, 2021

నేటి జీవిత సత్యం. *ధ్యానదీపం*

నేటి జీవిత సత్యం. ధ్యానదీపం

🔥నిప్పు కాలుస్తుంది.
💧నీరు తడుపుతుంది.
🌀గాలి వీస్తుంది.
🌏మట్టి పెంచుతుంది.
🌈ఆకాశం నింపుతుంది.
అది పంచభూతాల స్వభావం.

🍁మనిషికి కళ్లు- చూపుతాయి.
ముక్కు, చెవులు- వాసన, శబ్దాలు తెలుపుతాయి. నాలుక- రుచి పసిగడుతుంది. స్పర్శ(శరీరం) తత్సంబంధ విషయాన్ని గ్రహిస్తుంది.

🍁ఇలా పంచేంద్రియాలు వాటి ధర్మాల్ని చక్కగా నిర్వర్తిస్తుంటాయి. ఇవన్నీ మనిషికి అనుక్షణం అందుబాటులో ఉండే విధంగా చైతన్యం ప్రసాదించిన అద్భుత వనరులు.

🍁 వీటి ద్వారా కావాల్సినంత మంచి చెయ్యవచ్చు. చెడూ జరపవచ్చు.

🍁మరో మాటలో చెప్పాలంటే... ఇవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి.

🍁 వైద్యుడు కత్తితో శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు నిలబెడతాడు.

🍁 అదే కత్తితో నేరస్థుడు ఆరోగ్యవంతుడి ప్రాణాలు తీయగలడు.

🍁పంచభూతాల అసమతుల్యత ప్రకృతిని అతలాకుతలం చేస్తుంది. అవి సమపాళ్లలో ఉన్నప్పుడు ఎంత మంచి చేస్తాయో, అతివృష్టి (లేదా అనావృష్టి)లో అంత ప్రమాదమూ కలగజేస్తాయి.

🍁 పంచేంద్రియాలూ అంతే. అవి అదుపాజ్ఞల్లో ఉండకపోతే జీవిత రథాన్ని తప్పుదారిన నడిపిస్తాయి.
☀️☀️ధ్యానదీపం☀️☀️

🍁నిండు ప్రాణాలు బలిగొనడంలో కరవాలానిదే తప్పు అని, చావుబతుకుల్లోని మనిషిని కాపాడటంలో వైద్యుడి చేతిలోని కత్తిదే ఒప్పు అని భావించడం సరికాదు.

🍁ఎందుకంటే, ఆ రెండు ప్రక్రియల్లో ప్రత్యక్ష పాత్రధారులు అవి కావు కనుక. అసలు బాధ్యుడు వాటిని ఉపయోగించే వ్యక్తి మాత్రమే.

🍁పంచభూతాలు ప్రకృతిని, ఇంద్రియాలు మానవ దేహాన్ని సమతుల్యంగా సేవిస్తూ ఉంటాయి. అవి ఘనమైన వనరులు. అవసర నిమిత్తమే వాటిని కచ్చితంగా వినియోగించు కోవాలి. లేకపోతే అవే మనిషిని వాడుకోజూస్తాయి.

🍁ప్రధానంగా మనసు పట్ల అప్రమత్తంగా ఉండాలి.

🍁 చాలా శక్తిమంతమైన దాని విషయంలో ఎల్లప్పుడూ పూర్తి ఎరుకతో జాగరూకతతో మెలగాలి.

🍁 ఎందుకంటే, ఇంద్రియాలలోకెల్లా మనసును అదుపులో ఉంచడం అత్యంత కష్టతరం.

🍁 అందువల్లే- ‘దేహమనే రథంలో జీవుడు ప్రయాణికుడు.

🍁బుద్ధి రథ చోదకుడు.

🍁మనసు రథాన్ని నడిపే సాధనం; ఇంద్రియాలు అశ్వాలు.

🍁బుద్ధి మనసును నిర్దేశించాలి.

🍁కానీ, అంటువ్యాధి ఔషధశక్తిని సైతం అతిక్రమించినట్లు మనసు బుద్ధిని ఆక్రమిస్తుంటుంది’ అని కఠోపనిషత్తు చెబుతోంది.

🍁మనసు- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిప్రవాహం. దాన్ని నదీమార్గం వైపు తిప్పాలి. ఆ తరవాత అందులో దాగిన విద్యుత్‌ శక్తి లాంటి బలాల్ని పిండుకోవాలి.

🍁దాని ఉపరితలంపై పడవలై సాగిపోవాలి.

🍁వృథాగా సాగరంలో కలిసిపోయేలోపే ఆ నీళ్లను పంట పొలాల్లోకి మళ్ళించాలి.

🍁మనసున్న మనిషి చక్కగా సాగుచేయడం తెలిసిన రైతు కావాలి.

🍁బుద్ధి - యజమాని లాంటిది.

🍁మనసు- అంచనా వెయ్యలేనంత విలువగల సేవకుడి వంటిది.

🍁ఎవరి కర్తవ్యాలను వారు గుర్తెరిగి బాధ్యతలు నిర్వర్తించాలి.

🍁లేకపోతే పరిస్థితులు మారిపోతాయి.

🍁ఒకరి విధుల్ని మరొకరు చెయ్యాల్సివస్తుంది.

🍁అప్పుడు ఆశించిన దానికి భిన్నమైన ఫలితాలు ఎదురవుతాయి.

🍁జీవన గతులు తప్పుతాయి.

🍁ఆఖరున చూస్తే, ఏముంది... జీవితం మిగిల్చే దుఃఖవేదన.

🍁అందుచేత, తెలివి అనే యజమాని ఇంటి గుమ్మం ముందర కాపలాదారుడై నిలవాలి.

🍁‘ఇంద్రియాల్లో మనసు నేనే’ అన్నాడు గీతాచార్యుడు.

🍁 అంతటి దివ్యశక్తికి ప్రతిరూపమైన మనసుతో ధ్యానదీపం వెలిగించాలి.

🍁జీవన గృహాన్ని కాంతిమయం చెయ్యాలి.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment