Tuesday, March 8, 2022

అమ్మలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

 🌹🌹 *_అమ్మలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు_* 🌹🌹


*మహిళ-మహారాణి-మహాకాళి* 


పుట్టకముందే తననెందుకు చంపేస్తున్నారని కడుపులోని ఆడబిడ్డ కదులుతూ *ప్రశ్నిస్తోంది* 

.

బుడిబుడి నడకల నడిచే నన్ను బడికెందుకు పంపరని చిన్నతల్లి నడుస్తూ *ప్రశ్నిస్తోంది* .


అన్నా, తమ్ముడికి సమానంగా తనకెందుకు స్వేచ్ఛనివ్వరని కుమారి బేలగా *ప్రశ్నిస్తోంది* .


పదునాలుగేళ్లకే పలుపుతాడు తనకెందుకు వేస్తున్నారని పసియవ్వని ఏడుస్తూ *ప్రశ్నిస్తోంది* .

 *వేలగొంతుకలొక్కటయ్యిమీరూ తనకు బాసటయ్యి గర్జిస్తూ ప్రశ్నించండి*  ❗❗


ఇంటిలో,బడిలో,కార్యాలయాల్లో నాపైనే వివక్ష ఎందుకని నవయవ్వని తీక్షణంగా *ప్రశ్నిస్తోంది* .


లక్మీ స్వరూపమే మీ గడపలో కాలుపెడుతుంటే లక్షలకట్నం ఎందుకివ్వాలని నిండుమహిళ    ధైర్యంగా *ప్రశ్నిస్తోంది* .


మీకన్నా ఎక్కువ బాధ్యతలనిర్వర్తిస్తున్న నాకెందుకు ఆర్థికసమానత్వము లేదని పురుషులను గృహిణి తలెత్తి *ప్రశ్నిస్తోంది* .


కాటికెళ్ళే వయసులో కంటనీరెందుకు పెట్టిస్తారని కన్నబిడ్డలను కంటిపాపల్లగ చూసుకున్న  *అమ్మ* దీనంగా *ప్రశ్నిస్తోంది* .


*వేలగొంతుకలొక్కటయ్యిమీరూ తనకు బాసటయ్యి గర్జిస్తూ ప్రశ్నించండి* ❗❗


 *ప్రశ్నించే గొంతుకలకు ఈ కవిత అంకితం.* 

...వినయశ్రీ

No comments:

Post a Comment