Tuesday, March 8, 2022

🙏మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐

 🙏మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐

.........................

🙏భూమాత రాత నీదా 

అందుకే ఓపికకు అర్థం మయ్యావు వనిత

ఆనాటి సీత గీత నీదా

అందుకే గృహనిలా ఉండాలి అంటారు వనిత

కురుక్షేత్రంలో కుంతీ ద్రౌపదిలా

తరతరాలనుండి ఎదకోత ఎందుకు నీకే ఓ వనిత

వారధి అయినా సారథి అయిన శ్రీరామచంద్రుడు అయినా నీ గర్భంలోనే జన్మించాలి కదా ఓ వనిత

లాలనలో పాలనలో సేవా సామర్థ్యంలో నీకు సాటి ఎవరూ

రారు కదా ఓ వనిత

అయినా ఈ సమాజంలో ఏదో ఒకచోట ఎందుకు నీకే ఏదో ఒక  కొరత ఓ వనిత

అనునిత్యం ఏదో ఒక చోట నిన్ను అణిచే తత్వం ఎందుకు ఓ వనిత

అంతరాయాలు ,అడ్డంకులు ఆంక్షలు ఎన్నెన్నో నిన్నే అడ్డగిస్తూ ఉన్నా గంగ గోదావరి కావేరి నదిలా నీ ప్రవాహం అడ్డుకోవడం సాధ్యమా ఓ వనిత

పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానం కోసం నదుల లోనే నిన్నన్నవారే మునుగుతారు తెలుసా ఓవనిత

అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇంత అంధకారం

 ఈ సమాజంలో ఎందుకింతదౌర్భాగ్యం 

నీ పై ఇంత చిన్న తత్వం

ఇకనైనా మారాలి 

మహిళని అమూల్యంగా చూడాలి విలువ ఇవ్వాలి ఆ  విలువల్లో  మన మనంఅందరూ ఉండాలి

 మనదేశం పేరే భరత మాత కద ఓ వనితా 

పేరులోనే భక్తి 

ఆచరణలో కరువైంది ఆ ఆసక్తి ఓ వనిత

నీవే ఒక స్త్రీ శక్తి తెలుసా

                          ఓ వనిత !🙏

              🙏మీ శివరాయ్✍️

                      (జర్నలిస్ట్)

No comments:

Post a Comment