Sunday, March 13, 2022

Kashmir Files

 *Received as forwarded*

*#TheKashmirFiles*


*_~ViswanadhamGNV_*



Kashmir Files


ఈ‌ సినిమా‌కి‌ పెద్ద ప్రొడ్యుసర్‌లేడు, పబ్లిసిటీ‌కోసం కోట్లు‌ ఖర్చుపెట్టట్లేదు, అసలు‌ పబ్లిసిటీ యే లేదు, స్క్రీన్స్ పెద్దగా లేవు, మేం వెతుక్కుంటూ శాలిబండ సినీపోలిస్ కి వెళితే లోపల‌ పోస్టర్ కూడా లేదు. కానీ థియేటర్ మాత్రం హౌస్‌పుల్. వెతుక్కుంటూ వస్తున్నారు‌ మూవీ చూడటానికి. అది‌ ఏదో కమర్షియల్‌ సినిమా కాదు.. 1990 లో స్వతంత్ర భారతంలో  కాశ్మీరీ హిందువులు, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్ ల ధీనగాధ.



 JNU లాంటి విశ్వవిద్యాలయలలో ఆజాదీ, తుక్డే తుక్డే‌గ్యాంగ్ ల విషప్రభావంతో అసలు‌ కాశ్మీర్ ఏంటో ఈనాటి యువతకు తెలియదు. 



ఆనాడు జరిగిన వాస్తవాలను  అప్పటి ప్రభుత్వం మీడియా తొక్కిపెట్టింది. కాశ్మీరీ హిందువుల ధీనగాధ వాళ్ల స్వస్థలం నుండి కట్టుబట్టలతో, తమ ఆస్తులను, తమ ఆడవాళ్లను‌ వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి 5 లక్షల మంది కాశ్మీరీ లోయ ను వదలిపెట్టి వస్తే... అది‌‌ మన ప్రభుత్వాలకు‌ పట్టలేదు. 370 అధికరణ పేరుతో ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి మైనారటీలైన హిందువుల మాన‌ప్రాణాలకు‌ విలువ లేకుండా చేసింది. 



తమ స్వంత దేశంలో‌ స్వంత ప్రదేశానికి వెళ్లలేని దౌర్భాగ్య స్తితిలో 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, తమ జీవితకాలంలో‌ మళ్లీ‌ స్వంత ప్రాంతాన్ని చూడగలమా‌ అన్న ఎదురుచూపులతోనే, పునరావాస కేంద్రాలలోనే జీవితాలను చాలించిన‌ బ్రతుకులెన్నో. 



ఇవేమి‌ పట్టని‌, ఇదే సెక్యులరిజం అని భ్రమింపచేసిన ప్రభుత్వాలు చేసిన హత్యాకాండ, యే మానవ హక్కుల ఉద్యమకారులకు, యే సిక్లరిస్టలకు అవసరంలేని‌ బ్రతుకులయ్యాయి వారివి.


కాశ్మీర్ లో‌ ఇంటర్నెట్ లేదు, అక్కడ‌ 4 G లేదు, అక్కడ సైన్యం అరాచకాలు చేస్తుంది, వాళ్ల‌ హక్కుల‌కోసమే  సైనికులపై రాళ్లు వేస్తున్నారు...ఇలా‌ అనేకం‌‌ విని‌ ఉంటాం కానీ‌ ఇవన్నీ అక్కడే ఎందుకు జరుగుతున్నాయి‌ మిగతా చోట్ల జరగట్లేదు కదా అని ప్రశ్నిస్తే మతతత్వం. 



5 లక్షల కాశ్మీరీ పండిట్ లు వెళ్లగొట్టబడ్డారు,‌వేలమంది చంపబడ్డారు అని ప్రశ్నిస్తే ‌మతతత్వం. 



రోజులు మారాయి అందుకే ఇంత దైర్యం గా వాస్తవాలను‌ చూపగలగే సినిమా తీయగలగారు. 



ఇప్పటికైనా‌ చరిత్రలో ఏమి జరిగిందో ఈ‌నాటి‌ యువతరం తప్పక‌ తెలుసుకోవాలి. లేకపోతే మనకు భవిష్యత్ ఉండదు. 


ఈ‌ సినిమా కొన్ని‌ విషయాలను ‌టచ్ చేసింది. 


 కొన్ని‌విషయాలను‌ చాలా మోడరేట్ గా  చూపించారు  



 తలుచుకోవడానికి‌ కూడా ఇష్టపడని  అత్యంత దారుణమైన వాస్తవాలను పూర్తిగా స్క్రీన్ మీద చూపించాలంటే మనస్సు రాదు, పూర్తి వాస్తవాలను చూసి మనం కూడా తట్టుకోలేం. అయినా  ప్రతీ సన్నివేశం  లో తెలియకుండానే కళ్లు చెమరుస్తుంటాయి. 


అద్వానీ గారి‌ లాంటి వారు సినిమా చూసి‌ ఎందుకు‌ ఏడిచారో‌ మనకూ అనుభవమవుతుంది.


బ్రతికి ఉన్న చిట్ట చివరి కాశ్మీరీ పండిట్ ఎప్పటివరకు తను తిరిగి‌ కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటాడో అప్పటివరకు మీరు‌ గెలవలేరు.


ఇది ఈ‌ సినిమాలో తీవ్రవాదులను ఉద్దేశిస్తూ అన్న డైలాగ్,అదే‌‌ నిజం. ఆర్టికల్ 370 ఎత్తివేతను తాము బ్రతికి ఉండగా చూసిన వాళ్ల కళ్లలో‌ ఇదే భావన కనిపిస్తుంది.



 ఈ‌ సినిమా‌లో‌ కీలక పాత్రలో‌ నటించిన అనుపమ్ ఖేర్ ఆ పాత్రలో ‌జీవించాడంటే తాను స్వయంగా కాందిశీకులుగా కాశ్మీర్ ను వదిలిన‌ కాశ్మీరీ పండిట్ కావడమే,అందుకే తను నటించలేదు జీవించాడు. 


తప్పక చూడండి ఒకవేళ హిందీ సరిగా అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. అయినా భావానికి భాషతో పని లేదు. చూడండి పదిమందికి తెలియచెప్పండి. 


ఆదరించి ఇలాంటి సినిమాలు తీయడానికి మరింత స్పూర్తి గా నిలవాలి.


జైహింద్


#Kashmir files

#Right to justice

No comments:

Post a Comment