Sunday, March 13, 2022

🪢🐚64లక్షల జీవకణాలు🐚🪢

 *🪢🐚64లక్షల జీవకణాలు🐚🪢*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..*


*అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.*


*ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?*


*నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?*


*ఏ భాగము వినదు.*


*వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.*


*చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.*


*అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.*


*ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?*


*ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?*


*ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?*


*ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?*


*ఎందుకంటే ఈ దేహం నీది కాదు.* 


*ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.*


*ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..*


*రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.*


*రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.*


*చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.*


*ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.*


*రూపానికి ముందు నువ్వున్నావు.*


*రూపంలో నువ్వున్నావ్.*


*రూపం వదిలేశాకా నువ్వుంటావు.*


*ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.*


*ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం.*


*కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్....*


*https://www.facebook.com/groups/638078683192004*

No comments:

Post a Comment