*🧘♂️11- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 11*
*మనసు పాక్షిక నియంత్రణ*
మనం మనసు/అహంకారం అనేదే ఆలోచించేది, ఒకరి తలంపులూ. ఇవి ఒక నిరంతర ప్రవాహమే. తలంపులు లేని క్షణం ఒక్కటి కూడా ఉండదు.
ఈ తలంపులు ఎందుకు? తలంపులకు కారణం యేమిటి? ఆలోచించేవాడు, అతని తలంపులు కలిసే ఉన్నా, బుద్ధిపరంగా చూస్తే, తలంచేవాడు తలంపులకు కేంద్రం. ఎందుకంటే ప్రతీ తలంపు కూడా ఆ తలంచేవాడిదే కాబట్టి. అతని ధ్యాసే తలంపుకు జీవం. అలాగే ఒక తలంపుపై ఆ ధ్యాసను తీసివేస్తే లేక వేరొక తలంపుపై మరల్చితే, వెంటనే ఆ తలంపు మాయమైపోతుంది. ఇంకో తలంపు లేస్తుంది, దానిపై తలంచేవాడి ధ్యాస అప్పటికి నిలుస్తుంది. నిజానికి ఒకరి వాసనలు, సంస్కారాల వలన ఒక పెద్ద తలంపుల సముద్రమే ఉంది. అవి సమయం పరిస్థితులను బట్టి పుడుతుంటాయి, బాహ్య విషయాలపై తలంచే వాని ఆసక్తి వలన. ఇవి ఒక్కక్షణం కూడా ఆగకుండా పుడుతూనే ఉంటాయి. అందుకే అవి అనంతమైనవి, అంతం లేనివి.
మనసును నియంత్రించేందుకు చేసే ప్రయత్నాలు ముందే నీరు కారి పోతాయి. ఎందుకంటే ఆ ప్రయత్నాల్లో చెడు ఆలోచనలను తగ్గించడం, మంచివి అవసరమైన తలంపులను ఉంచడం కోసం కాబట్టి. ఈ పాక్షిక తనకు అవసరమైన పద్ధతి వలన కలిగేది అపజయమే, దీంట్లో తలంచేవాడి కీలకమైన స్థానం గురించి వదిలేయబడింది కాబట్టి. అందుకని కొన్నిసార్లు భయంకరమైనవి, చెడువి తలంపులు బాధిస్తాయి. మనసును నియంత్రణ చేసే సాధనం తలంచేవాడు తలంపుల నుంచి తన ధ్యాసను మరల్చడంలోనే ఉంది. అందువలన, యిది గమనించకుండా ఎన్ని సంవత్సరాలు నియంత్రణ సాధనలు చేసినా, ముందుకేమీ సాగదు. ఏ తలంపులనైతే వదుల్చుకోవాలో వాటికై సమయమంతా వ్యర్థం అయిపోతుంది.
నియంత్రణ సమస్యకు నివారణ యింకోచోట ఉంది. తలంపులను పాక్షికంగా నిలుపుదల గురించి ప్రయత్నించే కంటే, మనసు స్వభావం అర్థం చేసుకుని దాన్ని విశాలం చేయాలి. అవి తలంచే వాడిపై ఆధారపడి పుడుతున్నాయి కాబట్టి. అందుకనే తర్కం, ధ్యాసను తలంపుపైకాక తలంచేవాడిపై మరల్చవలెను.
తలంపులను జయించేయాలనే ప్రయత్నం వలన యింకా విజృంభించు తాయి. అనంతమైన తలంపుల సైన్యంతో యుద్ధం చేయడం అంటే అంతే. ఇంకా పిచ్చెక్కుతుంది తలంపులతో, తలంపుల యొక్క వ్యర్ధత్వాన్నీ, కలిగే నష్టాన్నీ యెవరైనా గుర్తిస్తే వాటిని మొత్తం లాగి కట్ట కట్టి తీసి బయట పడేస్తారు. అంతేగానీ కొన్ని ఉండాలనీ కొన్ని పోవాలనీ యేమీ అనుకోరు.
ఒకసారి కీలకమయిన తలంచేవాడు/అహంకారం/ నేను అనే భావన అర్ధం అయిందంటే చెదరిపోవడం, పరుగులు, వివిధ రకాలు అన్నీ మెల్ల మెల్లగా తగ్గుతూ, సహజంగానే మనసు నియంత్రణ జరుగుతుంది. మనసు యెన్నో పాయలుగా ప్రవహించేది ఒకటైపోతుంది. ఒకేదానిపై ధ్యాస, దృష్టి అంతా నిలకడగా నిలుస్తుంది.
ప్రపంచం వస్తువుల విషయాలు, సంబంధాలు తలంపుల నుంచి దృష్టిని తనపై, 'నేను’పై నిలపినపుడు యేమి జరుగుతుంది? రమణులకు అనుభూతి కలిగినట్లు, మనసు తన మూలస్థానం హృదయంలో కలిసిపోతుంది. బాహ్యంలోని విషయాలు, తన తోడైన తలంపుల నుంచి తలంచేవాడు దూరమయినపుడు యేమవుతుంది? తలంచేవాడు (వ్యక్తి/అహంకారం) లేకుండా పోతాడు. ఎక్కడికి? తను పుట్టు మూలస్థానం లోనికి. తనకేమీ స్వతంత్రత, ప్రత్యేక ఉనికి, స్వంత శక్తియేమీ లేవు. తలంపుల నుంచి వేరవగానే, తను పుట్టు మూలస్థానంలో కలసిపోతుంది.
మూలస్థానం గురించి కొంత వివరణ కావాలి. అది గ్రహించడం కష్టం యేమీ కాదు. నేను అనే భావన/అహంకారం/వ్యక్తికి ఒక మూలం, ఆధారం అయిన స్థానం ఉండాలి. ఎందుకంటే గాఢనిద్రలో అది మాయమైపోతుంది. మెలకువతో మళ్ళీ లేస్తున్నది కాబట్టి. ప్రతీరోజూ యీ జరిగే పద్ధతిలో నూతన శక్తితో తాజాదనం కలుగుతుంది. అందుకని ఆ మూలం అనంతశక్తి స్థానం ‘నేను’, ఆత్మ చైతన్యమే.
వ్యక్తి, ప్రపంచం యీ రెండూ ఉండే మనసు నియంత్రణ చేసే మిగతా సాధనల కంటే యీ పద్దతి సంపూర్ణమైనది, విజయాన్నిస్తుంది.
ఒకసారి రమణుని నేనెవరువిచారణ మార్గం సుగమమయితే తలంపులకు వేరుగా తలంచేవాడు, నేనుకు వేరుగా తలంచేవాడు మిగలరు. అలా వేరుగా ఉంటారు అనే భావనలు మాయమైపోతాయి. తప్పుడు గ్రహింపులూ, భావాలన్నీ హారతి కర్పూరంలా లేకుండా పోతాయి. మనసు దేహంతో తనను గుర్తించుకోవడం, నేనెవరు విచారణ చేయగా, తన స్వస్వరూపాన్ని గ్రహించడం జరుగుతంది. అప్పుడు మనసు నిర్మలం శుద్ధమే అని, పూర్ణచైతన్యం కంటే వేరుకాదని తెలుస్తుంది.
అంతర్ముఖమయి తీవ్రమైన నేనెవరు విచారణ చేస్తున్నపుడు, పాత వాసనలు ప్రపంచం వైపు ఆనందంకోసం పరుగులెత్తే అలవాట్లు పెద్ద అడ్డంకులుగా ఉంటాయి. అందుకే భగవాన్ 'దృఢ నమ్మకం' 'ఓపిక, ఓపిక, అనంతమైన 'ఓపిక' 'సద్గురు అనుగ్రహం'తో వాటిని అధిగమించవచ్చు అని చెప్పారు.
నేనెవరు విచారణ అంటే తలంపులు కోటను చుట్టు ముట్టి ఉంచడం లాంటిది, కోటలోనివన్నీ తలంచేవాడి ధ్యాసలేకపోవడం వలన ఆహారం లేక నశించిపోతాయి. కొన్ని, తలంచేవాడి పాత అలవాటైన ధ్యాసపడి లేస్తాయి. అయినా అవి తక్కువే కాబట్టి నేనెవరు విచారణతో వాటిని లేకుండా చేయవచ్చును. అలా మొత్తం తలంపుల సేవతో పోరాటం చేయనవసరం కలుగదు. కానీ యీ తతంగమంతటికీ యెంతో ఓపిక, ఓర్మి అవసరం. ఈ విచారణ పద్ధతి కొత్తది కాబట్టి, సాధన యింకా సాధన, దానిలో నిష్ణాతులైన వరకు చేయవలెను.
భగవాన్ నుంచి యెల్లప్పుడూ ఉండే అనుగ్రహం వలన, మనసు పరిపక్వంపై ఆధారపడి సరయిన సమయంలో విజయం చేకూరుతుంది. అనుగ్రహం సదా ఉంటుంది. భగవాన్చే బోధింపబడి ప్రయత్నం మొదలై, సాధన చేయించి, శుద్ధ మనసును తెలుసుకునే వరకు సద్గురువుల అనుగ్రహం వెంట వెంటనే ఉంటుంది. ప్రార్ధనతో అతనికి శరణాగతి చెందడం, అతని సహాయం సమగ్రంగా విజయం సాధించడంలో ఒక భాగమే. మనసు అనంత బ్రహ్మానందంలో మునిగి ఉంటుంది.
No comments:
Post a Comment