*🧘♂️20- శ్రీ రమణ మార్గము🧘♀️*
*నీవెవరివో నువ్వు కనుక్కో*
*అధ్యాయం - 20* *ఆత్మచైతన్య ఏకత్వం - పరమానంద సాగరం*
నీ పవిత్ర పాదపద్మములు శిష్యుల హృదయాన్ని గమనిస్తూ, దుఃఖాల్ని అంతం చేసి, ప్రతిదినం సహచర్యం వలన వారిలో శుద్ధ పరమానందాన్ని నింపుతాయి. విశ్వనాథుడవైన నీ పవిత్ర పాద యుగళము, నాకు అత్యంత ఆవశక్యమైన సమయంలో వచ్చి, వాటి సత్య దర్శనము నిచ్చి, నాలో భ్రాంతిమయ దుఃఖాన్ని రూపుమాపి నన్ను కాపాడుతాయి.
*మురగనార్ - రమణ అనుభూతి*
(పద్యం 65
సద్గురు పాదాలకు శరణాగతి చెందిన శిష్యులకు సత్యాన్ని దర్శింపజేసే సద్గురువును స్తుతిస్తూ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఎవరైనా యెంత తపనతో ఆధ్యాత్మిక సాధన చేసిననూ ఆత్మజ్ఞానం ముంగిట వరకే చేరుకోగలరు. అహంకార పూరితమైన మనసు, సుడిగుండంలా తిరుగుతూ లేస్తున్న తలంపులను తన స్వశక్తి ప్రయత్నాలతోనే తట్టుకోగలననుకుంటుంది. ఎందుకంటే, మనసు తనకు అలవాటయిపోయిన బాహ్య విషయాల్లో చరిస్తూ, మలినమయిపోయింది కాబట్టి. సద్గరువు అనుగ్రహం లేకపోతే, అనంతంగా ప్రోగు చేయబడిన వాసనలు సంస్కారాలు యెంతటి వారినైనా ఆధ్యాత్మిక మార్గం నుండి ప్రక్కదారి పట్టిస్తాయి.
సద్గురువు అనుగ్రహం వారి పవిత్ర మౌనం నుంచి లోనికి చొచ్చుకుని పోయే వారి పవిత్ర నేత్ర వీక్షణం నుంచి గానీ ప్రవహిస్తుంటుంది. అయినా పవిత్ర గ్రంథాల్లో సద్గురు పాద పద్మములనే శిష్యుల శరణాగతికి అనుగ్రహ దాతలుగా చాటాయి. శ్రీ మురుగనార్ తన 'శ్రీ రమణ అనుభూతి’లో సద్గురు రమణ పాదపద్మముల మహాత్మ్యమును స్మరిస్తూ, తనకు గాఢమౌనం ఆనందమయ సహజ స్థితికి చేర్చిన ఆ పవిత్ర పాదయుగళానికి తన కృతజ్ఞతా హృదయ భావనలను ఆ తన్మయ పద్యాల్లో ప్రవహింపచేస్తారు. రమణుల పవిత్ర పాదపద్మములు మన ధ్యానాల్లో వరదలా నిండి మనలో పరమానందాన్ని పొరలి పొంగింపజేస్తాయి. రమణుల పవిత్ర పాదయుగళం శిష్యులను గమనిస్తూ అనుగ్రహంతో వారికీ, పృథ్విలో జన్మ, పునర్జన్మల్లో మునిగిపోకుండా కాపాడి రక్షిస్తాయి.
సద్గురు రమణుల శిష్యులు, భక్తులు, కాలంయొక్క బంధనాల వలనకాక, కాలాతీత సద్గురు అనుగ్రహ వీక్షణముల వలన బంధితులై, అంతం లేని ప్రయాణం - తల్లి గర్భం నుంచి గర్భానికి, జన్మ నుండి జన్మకు, మరణం నుండి మరణానికి విముక్తులవుతున్నారు. ఏం జరుగుతుందో మురగనార్ వివరిస్తున్నారు.
శరణాగతి అంతా అతని చరణముల చెంతనే, అతను నాలోని అహంకారాన్ని తీసుకుని వారిలోని ఆత్మను నాలో నింపారు. అలా నన్ను అతని నుంచి దూరం చేసిన చాలా చెడ్డ పొరపాటును తుడిచివేయబడింది, అంతర్ముఖ గ్రాహ్యమైన తన సహజ స్థితిని నాకు తెలియజేస్తుంటే, అతని దివ్య ప్రకాశంతో నా హృదయం నిండిపోయినది.
సద్గురువు యిలా శిష్యునికిచ్చి, వారు తిరిగి పొందేది యేమీ ఉండదు, యెందుకంటే వారు యిప్పటికే పరిపూర్ణ చైతన్యంగా నిలచి ఉన్నారు కాబట్టి. కాలం కోరలకు వారు అతీతమై ఉన్నారు. ఆ పూర్ణత్వానికి కలిసేది యింకేమీ లేదు. కానీ, శిష్యుడు యెంతో లాభం పొందుతాడు, మహోన్నతమైన ఏకత్వ స్థితికి చేరి పూర్ణంగా కొత్త జీవనాన్నే పొందుతాడు. సద్గురువు శిష్యునిలోని జ్ఞానాగ్నిని రగిల్చి అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతాడు. గురు అనుగ్రహం వలన సహజస్థితి పరమానందం, ఏకత్వ ఉనికి శిష్యుడు పొందుతాడు. సద్గురువు తనపై శిష్యుని నిరంతర భక్తి, దృష్టి తప్ప యింకేమీ కోరడు.
సద్గురు అనుగ్రహం గురించి, శిష్యులు భక్తులు తెలుసుకోగోరినపుడు, రమణులు వారికి వివరించడానికి వెనుకాడరు. అలాగే సద్గురు అనుగ్రహం గురించి తెలిపిన పవిత్ర గ్రంథాల్లోని సంఘటనలను ఉదహరిస్తారు. శూత సంహితలోని ఒక ఉదాహరణను రమణులు వివరించారు.
జీవన్ముక్తుల చూపులలో పడినవారు యెన్నో రకాల పాపాల నుండి విముక్తులై, వారు కూడా జీవన్ముక్తులవుతారు. జీవన్ముక్తుని వంశం అంతా శుద్ధి అవుతుంది. జీవన్ముక్తుని తల్లికే, ఏమి అవసరమో అది చేసినవారు. అతని వలన ఈ పృథ్వి అంతా శుద్ధి చేయబడుతుంది.
ఇది చెప్పిన తరువాత, జ్ఞానుల గొప్పతత్త్వం గురించి తెలిపేవి యెన్నో సంఘటనలు శూత సంహితలో ఉన్నట్లు చెపుతూ భగవాన్ 'ఒక జ్ఞాని భూమిపై ప్రపంచంలో అవతరిస్తే, శిష్యులు, భక్తులు, నాస్తికులు, పాపాత్ములు కూడా యెంతో లాభం పొందినవారవుతారు'.
తమిళ వేదాంత గ్రంథమైన 'కైవల్య నవనీతం' నుంచి కొన్ని పద్యాలను తెలిపేవారు. ఒక శిష్యుడు, తనను తాను దర్శించుకొనే భాగ్యం కలిగించిన సద్గురు అనుగ్రహాన్ని కృతజ్ఞతగా స్తుతిస్తాడు.
'సద్గురు దేవా’ నాలో అంతర్ముఖంగా ఉన్న సత్యానివి నువ్వే. నా లెక్కలేనన్ని జన్మల్లో నన్ను నడిపిస్తూ ఉన్నావు. నన్ను నడిపించుటకు ఒక శరీరం ధరించి వచ్చిన నీకు జయమవు గాక! నన్ను విముక్తి చేసిన నీ అనుగ్రహానికి ఋణాన్ని యెలా తీర్చుకోవాలో నాకు తెలియదు. నీ పవిత్ర పాద యుగళమునకు జయము, జయము'. గురువు శిష్యుని వైపు కరుణా దృక్కులతో 'నువ్వు నాకు తీర్చవలసిన అతి ఉన్నత ఉత్తమమైనది, అజ్ఞానం, సందేహం, అపోహలు అనే మూడు ఆటంకాల నుండి దూరమై, నువ్వు స్థిరంగా ఆత్మలో సుస్థితుడవయి ఉండడమే' అని చెపుతారు.శిష్యుని, అతనికున్న అన్ని బంధాలు వాసనల నుంచి విముక్తిడిని చేసి సత్యాన్వేషణకునిగా తీర్చిదిద్ది, సత్యాన్ని దర్శించేవాడిగా సద్గురువు చేస్తాడు. అందుకే సద్గురువంటే వస్తువులను బంగారంగా మార్చే రసవిద్యలో గొప్ప నిష్ణాతుడు. రసవిద్యతో మార్చబడిన బంగారం యింకో వస్తువును బంగారంగా మార్చలేదు. కానీ సద్గురువు అనుగ్రహం పొంది, తన్ను తాను తెలుసుకున్న ఆత్మస్థితిలో నిలచిన శిష్యుడు తన అనుగ్రహాన్ని యితరులపై ప్రసరింపజేసి వారిని అహంకార రహితులుగా ఆ స్థితికి చేర్చగలడు.
రమణుల అందం కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంది, ఆకర్షించి బంధిస్తుంది. ఆయన కళ్లలోని ప్రకాశం శక్తి అనుగ్రహం యెవరినైనా కదలనీయదు. ఆయన శరీరాన్ని పట్టించుకోని రోజుల్లో స్నానం సంస్కారం లేక జుట్ట పిడచ కట్టి గోళ్లు పెరిగిపోయి ఉన్నపుడు కూడా అంతే.
ఈ ఆకర్షణ ఆయన బంగారువన్నె, చక్కగా అమరిన అందమైన దేహం వలననైతే కాదు. అది భౌతికమయిన అందం కాదు. కానీ ఆయన ఆత్మ నిష్టులుగా నిరంతరంగా మొదటి నుంచీ ఒక్కక్షణం కూడా విరామమే లేకుండా నిలచివున్న కారణంగా ప్రసరించే ప్రకాశమే, యెవరి దృష్టినైనా ఆకర్షించి నిలిపివేసి కట్టి పడేస్తుంది. సత్ (నేను)గా స్థిరంగా నిలచివున్న వారెవరైనా సాక్షాత్తూ భగవన్మూర్తులే.
*ఓం అరుణాచలశివ*
No comments:
Post a Comment