Tuesday, August 2, 2022

మంచి మాట.. లు(30-07-2022)

 శని వారం :-30.07.2022

ఈ రోజు AVB మంచి మాట.. లు

మన అనుకుంటే పరాయి వారు కూడా మనవారే అవుతారు,,,నీకు నువ్వు గిరి గిసుకుంటే నువ్వు ఒక్కడివే మిగులుతావు అయినవారు కూడా పరాయివారువుతారు

జీవితం ఎవరికి శాశ్వతం కాదు మనం సంపాదించిన ఆస్తులు మనకు శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం .

ఆత్మ విశ్శాసం దెబ్బతింటే సామర్థ్యం పని చెయ్యదు, అందుకే ఎప్పుడూ ఆత్మ విశ్శాసాన్ని కోల్పోకండి ! ఎ బంధం లో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికి విడిపోదు

ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుటారు ప్రేమాభిమానాలు పొంగించేస్తారు, ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు నిన్ను మర్చిపోతారు అసలు నువ్వు ఉన్నావో పోయవో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు .

మనకు కోపంతో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగీపోతుంది . అదే కోవం వెనకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది . అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు మౌనం చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనం తో చాల సమస్యలు రాకుండా చూసుకో వచ్చు .

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు  💐🤝

No comments:

Post a Comment