Tuesday, August 2, 2022

మంచి మాట..లు(31-07-2022)

ఆదివారం :-31-07-2022

ఈ రోజు AVB మంచి మాట..లు

చూడు మిత్రమా
మనకి అన్నం పెట్టిన వారు పెట్టి మరిచిపోవచ్చు, కానీ తిన్నవారు ఎప్పుడు మరిచిపోకూడదు, మనకి సహాయం చేసిన వారు చేసి మరిచి పోవచ్చు, కానీ సహాయం పొందిన వారు ఎప్పుడు మరిచిపోకూడదు, అలా మరిచిపోయిననాడు మన కంటే 🐕 ఇది వంద రేట్లు మేలు..గుర్తుంచుకో,,

మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు, అలాంటి వారికి మన మౌనమే చెప్పుదెబ్బ,,

జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, వెయ్యిసార్లు వెయ్యిమందిని యుద్ధంలో ఓడించిన వాడికంటే తన మనసును తాను జయించిన వాడే గోప్పవాడు, అందుకే మనసును అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు,,

టైం బాలేనప్పుడు సింహం కూడా ఏ సర్కస్ లోనో, ఏ జూ లోనో కుప్పిగంతులు ఎయ్యాల్సి వస్తుంది, మనం కూడా అంతే, మన టైం బాలేనప్పుడు పొంతన లేని జీవితం గడపాల్సి వస్తుంది, ప్రతి అడ్డమైన వాడితో మాట పడాల్సి వస్తుంది, అంతమాత్రాన మనం తగ్గినట్టు కాదు, నెగ్గే రోజు ఇంకా రాలేదంతే,,
సేకరణ ✍️ AVB సుబ్బారావు*_ 🤝

సేకరణ

No comments:

Post a Comment