ప్రేమ కొంచెం అయినా మనసుకు కలిగే సంతోషం ఎక్కువ... సాయం చిన్నదైనా అది ఇచ్చే తృప్తి ఎక్కువ... పరుష మాట చిన్నదైనా మనసును గాయ పరుస్తోంది... అబద్దం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది..... అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది... రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది...
ఇలా మనం తెలిచో, తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెనుభూతంగా అనగా చెడు కర్మలుగా మారి దుఃఖ సహిత జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు... చిన్న చిన్న చెడు అలోచనలు అనే మర్రి గింజంతంగ ఉన్నవి మహా వట వృక్షంగా ఎదిగి జనన మరణ చక్రబందంలలో ఇరుక్కొని ప్రతి జన్మ రక రకాల కష్టాలతో జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు... ఇవన్నీ మనసు మాయగాడు అడే వింత నాటక చదరంగంలో మానవులు పావులుగా అనగా రాజు, మంత్రి, ఏనుగు, గుర్రం,శకటం, బటుడు పాత్రాలను పోషిస్తారు.. అందమైన జీవితాన్ని సుందరంగా,ఆనందంగా జీవించాలి అంటే మనసుకు పగ్గాలు వేసి ఆత్మ జ్ఞానం పొంది అందరిలోనూ ఉన్న ఆత్మను పరమాత్మగా మార్చుకునే అవకాశం అందరికీ ఉంది... అదే సరైన సాధన.. సరైన సాధన ద్వారా త్రికాల జ్ణానం పొంది అనగా భూత వర్తమాన భవిష్యత్ తెలుసుకొని నిరంతరం ఎరుకతో దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు కృషి చేస్తారు... సాధన మొదలు పెట్టండి బ్రహ్మ ముహూర్తంలో 3.35 నుండి మొదలు.... అంతులేని అనంతమైన విశ్వ శక్తిని పొందండి.
బ్రహ్మ ముహూర్తంలో సాధన చేసి ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను.
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment