Friday, November 25, 2022

:::పరాధీనం:::

 *:::::::పరాధీనం::::::::*
   పరులు  (ఇతరులు) లకు మనదై వున్న దేనినైనా స్వాధీన పరిచినప్పుడు పరాధీనం చేయడం అంటాము.
    పరుల ఆధీనంలోకి మనం వెళ్ళటం కూడా పరాధీనమే.
   ఉద్యోగ సమయం లో  ఆ పని గంటల్లో మనం పరాధీనులం అయి వుంటాము.
      ఇది భౌతికంగా వున్నది .ఇది సర్వ సాధారణం. తప్పదు
   కాని మనం మానసికంగా పరాధీనులం అవ్వ వలసిన పనిలేదు.
  మానసిక పరాధీనత అంటే సొంతంగా ఆలోచించక, సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా,పరీశీలించ కుండా,  పరీక్షించ కుండా, ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం , అనుసరించడాన్ని మానసిక పరాధీనత అంటారు.
        అనగా మనస్సు ని ఇతరులకు స్వాధీన పరచడం. మనం వారి చేతుల్లొ తోలు బొమ్మలం. వారి మాటలను వల్లే వేస్తూ గడిపేస్తాం.
    *మానసిక పరాధీనతలో వున్న మనస్సు ధ్యాన స్థితి లో వుండలేదు.*
షణ్ముఖానంద9866699774.

No comments:

Post a Comment