Sunday, November 27, 2022

శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం"

శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం"

1. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమతే౹ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే౹౹

Pray the Almighty by reciting Govinda, Govinda, Govinda. Foolish man! When time comes to depart the world, nothing, like your expertise in grammer will save you.

గోవిందా, గోవిందా, గోవిందాయని గోవిందుని భజించుము. ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

2. మూఢ జహీహి ధనాగమతృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్౹ యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తమ్౹౹

O, unwise man! Get rid of the thirst of earning wealth. Control your mind to be good and positive. Be satisfied with whatever you got as you were deserved to get.

మూర్ఖుడా! ధన సంపాదననే దాహాన్ని వర్జించుము. మనస్సును సంబాళించుకుని సద్బుద్ధిని అలవర్చుకొనుము. నీకు కర్మానుసారం లభించిన అదృష్టంతో తృప్తిచెందుము.

3. నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగామోహావేశమ్౹ ఏతన్మాంసావసాది వికారం, మనసి విచిన్తయ వారం వారమ్౹౹

Do not get lusty desires just by seeing the women's breast or novel region. Think again and again that these are nothing but the sickening flesh and meat.

స్త్రీల నాభి-స్తనాదులను చూచి కామ, మోహ వికారాలలో మునిగిపోకుము. అవి విరక్తిని కల్గించు మాంసమేయని మరల మరల మనసున తలచుకొమ్ము!

4. నలినీదలగత జలమతితరలం, తద్వజ్జీవితమతిశయచపలమ్౹ విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తమ్౹౹

Like droplets of water slip away on the lotus leaf, this life is very unstable and slippery.The entire world is filled with sorrows due to sufferings, diseases and ego.

తామరాకుపై నీటి బిందువువలె ఈ జీవితం గర్వంతో నిలకడలేనిది. సమస్తలోకమూ బాధ, రోగము, దురభిమానములనే దుఃఖములో మునిగియున్నది.

5. యావద్విత్తోపార్జన సక్తః, స్తావన్నిజ పరివారో రక్తః౹ పశ్చాజ్జీవతి జర్జర దేహే, వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే౹౹

So long as you are able to earn, your family shows affection. But once you get old, they dislike even to talk to you.

నీవు సంపాదించి పెట్టినంతకాలం నీకుటుంబం నిన్ను అభిమానిస్తుంది. వృద్ధుడవైన తర్వాత నీతో మాట్లాడటానికే వారు ఇష్టపడరు.

6. యావత్పవనో నివసతి దేహే, తావత్పృచ్ఛతి కుశలం గేహే౹ గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్కాయే౹౹

So long as you are alive, your family cares for you. But, once you are dead, even your wife will be afraid to see the body.

నీవు బ్రతికున్నంతవరకే నీ కుటుంబం నీ గురించి పట్టించుకుంటుంది. ప్రాణంపోయిన మరుక్షణమే నీ భార్యకూడా శవంచూచి భయపడుతుంది.

7. బాలస్తావత్క్రీడాసక్తః, తరుణస్తావత్తరుణీసక్తః౹ వృద్ధస్తావచ్చిన్తాసక్తః, పరే బ్రహ్మణి కోఽపి న సక్తః౹౹

Playing during childhood, liking young women when young, and worries when old finishes off the life. There is no time or opportunity to show interest in the Almighty, the Parabrahmam.

బాల్యం ఆటపాటలతోను, యవ్వనం స్త్రీలంటే వ్యామోహంతోను, వృద్ధాప్యం చింతలతోను మనిషి గడిపేస్తాడు. దైవమంటే ఎప్పటికీ ఆసక్తి ఉండదు.

8. కాతే కాన్తా కస్తే పుత్రః, సంసారోఽయమతీవ విచిత్రః౹ కస్య త్వం కః కుత ఆయాతః, తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః౹౹

Who is wife, who is the son? This world is extreamely peculier and strange! Brother, indulge in deep thoughts like, who am I and where from I came!

భార్య ఎవరు, పుత్రుడెవరు? నేనెవర్ని, ఎక్కడనుంచి వచ్చాను? ఈ సంసారం చిత్రాతిచిత్రమైంది! ఈ ఇహ తత్వాన్ని గూర్చి ఆలోచించు సోదరా!

9. సత్సఙ్గత్వే నిస్స్ఙ్గత్వం, నిస్సఙ్గత్వే నిర్మోహత్వమ్౹ నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః౹౹

The company of good people rids one of bondings, that rids the passion, which in turn rids one of ficklemindedness. The focus on Paramatma yields relief and liberation from the life bonds.

మంచి స్నేహముల వలన బంధనలు పోతాయి, దానివలన మోహం తొలగిపోతుంది, దానివలన చపలత్వం పోతుంది. ఈ నిశ్చలతత్వం వలన భవబంధాలనుండి విముక్తి, మోక్షము లభిస్తుంది.

10. వయసిగతే కః కామవికారః, శుష్కే నీరే కః కాసారః౹ క్షీణేవిత్తే కః పరివారః, జ్ఞాతే తత్త్వే కః సంసారః౹౹

Like a dried up pond, lust vanishes with age. When prospirty is lost, relatives avoid you.If you understand this, there will be no familial feeings.

నీరులేని తటాకంవలె, వయస్సు నశించంగానే కామ వికారమూ నశిస్తుంది.నీ సంపదపోతే బంధువులూ నిన్ను వదిలేస్తారు. ఈ తత్వం అవగతమైతే ఇంక ఈ సంసారబంధాలు ఉండవు.

11. మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్౹ మాయామయమిదమఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా౹౹

Don't be proud of prospirity, friends and youthful arrogance. All these will vanish in no time. The unverse is an illusion. The knowledge about Paramatma tarva only will take care of you.

సంపద, స్నేహితులు, యౌవ్వన మదములతో మిడిసి పడకుము. ఇవన్నీ ఒకే ఒక్క నిమిషకాలంలో మటుమాయమైపోతాయి. ఈ జగత్తు అంతా మాయామయం.పరబ్రహ్మ వివేకమే నీకు హితమైనది.

12. దినయామిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసన్తౌ పునరాయాతః౹ కాలః క్రీడతి గచ్ఛత్యాయుః, తదపి న ముఞ్చత్యాశావాయుః౹౹

The gaint wheel of time repeatedly brings the day-night and seasons cycles. In this game played by the time, one gets aged and dies. Even then, the cyclone of greed does not cease. పగలు-రాత్రి, ఉదయం-సాయంత్రం, శిశిరము-వసంత ఋతువులు తిరిగి వస్తునే ఉంటాయి. కాలం ఆడే ఈ ఆటలో ఆయుష్షు తీరిపోతుంది. ఐననూ, అత్యాశ యనే తుఫాను మాత్రం తగ్గదు.

13. ద్వాదశమఞ్జరికాభిరశేషః, కథితో వైయాకరణస్యైషః౹ ఉపదేశో భూద్విద్యానిపుణైః, శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః౹౹

This boque of twelve sanskrit stanzas were rendered by Shri Sankaracharya, the great learned saint to enlighten the aged Sanskrit Grammer pundit of Benaras.

ఈ పన్నెండు శ్లోకములను పూలగుత్తిని, యదార్థమైన విద్యాపారంగతుడైన శ్రీ శంకర భగవత్పాదులవారు (కాశీనగరమందు డుకృణ్) వ్యాకరణ పండితునకు ఉపదేశించిరి.

14. కాతే కాన్తా ధన గతచిన్తా, వాతుల కిం తవ నాస్తి నియన్తా౹ త్రిజగతి సజ్జన సంగతిరైకా, భవతి భవార్ణవతరణే నౌకా౹౹

Why do you always worry about women and wealth? Is there nobody to guide you? The only ship to cross the ocean of life is the company of good people.

ఓయీ! స్త్రీ, ధనముల గురించి ఎందులకు అంత ఆలోచన? నీకు సరైన బోధనలు చేయువాడు లేడా? సంసార సాగరాన్ని దాటేందుకు ఈ మూడు లోకములలో నీకున్న ఒకే సాధనం, సజ్జన సాంగత్యమే!

11. మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్౹ మాయామయమిదమఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా౹౹

Don't be proud of prospirity, friends and youthful arrogance. All these will vanish in no time. The unverse is an illusion. The knowledge about Paramatma tarva only will take care of you.

సంపద, స్నేహితులు, యౌవ్వన మదములతో మిడిసి పడకుము. ఇవన్నీ ఒకే ఒక్క నిమిషకాలంలో మటుమాయమైపోతాయి. ఈ జగత్తు అంతా మాయామయం.పరబ్రహ్మ వివేకమే నీకు హితమైనది.

12. దినయామిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసన్తౌ పునరాయాతః౹ కాలః క్రీడతి గచ్ఛత్యాయుః, తదపి న ముఞ్చత్యాశావాయుః౹౹

The gaint wheel of time repeatedly brings the day-night and seasons cycles. In this game played by the time, one gets aged and dies. Even then, the cyclone of greed does not cease. పగలు-రాత్రి, ఉదయం-సాయంత్రం, శిశిరము-వసంత ఋతువులు తిరిగి వస్తునే ఉంటాయి. కాలం ఆడే ఈ ఆటలో ఆయుష్షు తీరిపోతుంది. ఐననూ, అత్యాశ యనే తుఫాను మాత్రం తగ్గదు.

13. ద్వాదశమఞ్జరికాభిరశేషః, కథితో వైయాకరణస్యైషః౹ ఉపదేశో భూద్విద్యానిపుణైః, శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః౹౹

This boque of twelve sanskrit stanzas were rendered by Shri Sankaracharya, the great learned saint to enlighten the aged Sanskrit Grammer pundit of Benaras.

ఈ పన్నెండు శ్లోకములను పూలగుత్తిని, యదార్థమైన విద్యాపారంగతుడైన శ్రీ శంకర భగవత్పాదులవారు (కాశీనగరమందు డుకృణ్) వ్యాకరణ పండితునకు ఉపదేశించిరి.

14. కాతే కాన్తా ధన గతచిన్తా, వాతుల కిం తవ నాస్తి నియన్తా౹ త్రిజగతి సజ్జన సంగతిరైకా, భవతి భవార్ణవతరణే నౌకా౹౹

Why do you always worry about women and wealth? Is there nobody to guide you? The only ship to cross the ocean of life is the company of good people.

ఓయీ! స్త్రీ, ధనముల గురించి ఎందులకు అంత ఆలోచన? నీకు సరైన బోధనలు చేయువాడు లేడా? సంసార సాగరాన్ని దాటేందుకు ఈ మూడు లోకములలో నీకున్న ఒకే సాధనం, సజ్జన సాంగత్యమే!

18. కురుతే గఙ్గాసాగరగమనం, వ్రతపరిపాలనమథవా దానమ్౹ జ్ఞానవిహినః సర్వమతేన, ముక్తిం న భజతి జన్మశతేన౹౹

One may go to Gangasagar, observe fasts, and give away riches in charity ! Yet, devoid of jnana, nothing can give mukthi even at the end of a hundred births.

గంగలోను, సముద్రమందును స్నానం చేసినా, వ్రతములను ఆచరించినా, దానములను చేసినప్పటికిని ఆత్మజ్ఞానము లేనిచో నూరుజన్మలకైనను, ఏమతము పాటించిననూ మానవుడు మోక్షము పొందలేడు.

19. సుర మందిర తరు మూల నివాసః, శయ్యా భూతల మజినం వాసః౹ సర్వ పరిగ్రహ భోగ త్యాగః, కస్య సుఖం న కరోతి విరాగః౹౹

Take your residence in a temple or below a tree, wear the deerskin for the dress, and sleep with mother earth as your bed . Give up all attachments and renounce all comforts . Blessed with such vairgya, could any fail to be content ?

దేవాలయంలో చెట్టుక్రింద నివాసముంటూ, భూమి మీద పడుకొంటూ, జింక చర్మమునే ధరించి, అన్ని భోగములను వదలి, వైరాగ్యముతో భగవంతుని ధ్యానిస్తూ జీవించినచో ఎవరికి సుఖము కలుగకుండును? 

20. యోగరతో వాభోగరతోవా, సఙ్గరతో వా సఙ్గవీహినః౹ యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నన్దతి నన్దతి నన్దత్యేవ౹

One may take delight in yoga or bhoga, may have attachment or detachment . But only he whose mind steadily delights in Brahman enjoys bliss, no one else.

యోగాసక్తుడైనా లేదా భోగాసక్తుడైనా; వాంఛాసక్తుడైనా లేక కోరికలయందు విరక్తుడైనా; ఎవని చిత్తము పరబ్రహ్మము నందు స్థిరత్వము కలిగి ఉండునో, అతడు ముమ్మాటికిని ఆనందమును పొందును.

21. భగవద్ గీతా కిఞ్చిదధీతా, గఙ్గా జలలవ కణికాపీతా౹ సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్య యమేన న చర్చా౹౹

Let a man read but a little from giitaa, drink just a drop of water from the ganges, worship but once muraari . He then will have no altercation with Yama .

ఎవరు భగవద్గీతను కొంచమైనను గౌరవించునో, బహు కొంచెమైనా గంగాజలమును త్రాగునో, ఒక్క పర్యాయమైనను భగవంతుని పూజించునో, అట్టి వానిని గూర్చి యముడు తలవడు (అనగా అతనికి పాపములంటవు).

22. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనమ్౹ ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాఽపారే పాహి మురారే౹౹

Born again, death again, again to stay in the mother's womb ! It is indeed hard to cross this boundless ocean of samsaara . Oh Murari ! Redeem me through Thy mercy.

మరల పుట్టుట, మరల చచ్చుట, మరల మరల తల్లి గర్భమునందు పరుండుట - ఈ బాధలతో కూడి, తరింపరాని/దాటరాని ఈ అపార సంసారము నుండి ఓ పరమాత్మా ! దయతో కాపాడుము.

23. రథ్యా చర్పట విరచిత కన్థః, పుణ్యాపుణ్య వివర్జిత పన్థః౹ యోగీ యోగనియోజిత చిత్తో, రమతే బాలోన్మత్తవదేవ౹౹

There is no shortage of clothing for a monk so long as there are rags cast off the road . Freed from vices and virtues, onward he wanders . One who lives in communion with god enjoys bliss, pure and uncontaminated, like a child and as an intoxicated.

వీథులందు దొరికే గుడ్డపీలికలతో తయారైన బొంతలతో తృప్తిచెందువాడును, పాపపుణ్యాల ప్రసక్తిలేని త్రోవలో వెళ్ళువాడునూ, యోగములో లగ్నమైన మనస్సుగల విరక్తుడు, బాలునివలె, పరబ్రహ్మములో తేలియాడుచుండును.

24. కస్త్వం కోఽహం కుత ఆయాతః, కా మే జననీ కో మే తాతః౹ ఇతి పరిభావయ సర్వమసారమ్, విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్౹౹

Who are you ? Who am I ? From where do I come ? Who is my mother, who is my father ? Ponder thus, look at everything as essenceless and give up the world as an idle dream.

నీవెవడవు ? నేనెవరిని ? ఎక్కడ నుండి వచ్చాము ? ఈ తల్లి ఎవరు ? తండ్రి ఎవరు ? - అనే ఆలోచనలతో, ఇది అంతయు కలవలె అసత్యమని తెలిసికొని, ఈ బాహ్య ప్రపంచముపు వ్యామోహములను విడిచి, సత్యమగు పరబ్రహ్మమును ఆశ్రయించవలెను. 

25. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః, వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః౹ భవ సమచిత్తః సర్వత్ర త్వం, వాఞ్ఛస్యచిరాద్యది విష్ణుత్వమ్౹౹

In me, in you and in everything, none but the same Vishnu dwells . Your anger and impatience is meaningless . If you wish to attain the status of Vishnu, have samabhaava, equanimity, always.

నీయందు, నాయందు అందరిలోనూ ఒకే పరమాత్మ నిండియున్నాడు. ఐననూ నాయందు కోపం వహించడం వృధా కాదా? విష్ణుపథం పొందాలంటే, అందరియొడలా ఎల్లప్పుడూ సమభావము కలిగియుండుము.

26. శత్రౌ మిత్రే పుత్రే బన్ధౌ, మా కురు యత్నం విగ్రహసన్ధౌ౹ సర్వస్మిన్నపి పశ్యాత్మానం, సర్వత్రోత్సృజ భేదాజ్ఞానమ్౹౹

Waste not your efforts to win the love of or to fight against friend and foe, children and relatives . See yourself in everyone and give up all feelings of duality completely.

బంధువులు, మిత్రులు, పుత్రులతో అతి ప్రియతను, శత్రువులతో వైరములు చేయుటలోనూ ప్రయాస పడకుము. అందరిలోనూ నీ ఆత్మనే చూడుము. అందరియెడలా భేదమనే అజ్ఞాన భావమును త్యజించుము.

27. కామం క్రోధం లోభం మోహం, త్యక్త్వాఽత్మానం భావయ కోఽహమ్౹ ఆత్మజ్ఞాన విహీనా మూఢాః, తే పచ్యన్తే నరకనిగూఢాః౹౹

Give up lust, anger, infatuation, and greed . Ponder over your real nature . Fools are they who are blind to the Self . Cast into hell, they suffer there endlessly.

వాంఛలనూ, కోపాలనూ, స్వార్థాన్నీ, మోహాలనూ, అహంభావాన్నీ వదిలివేయుము. ఆత్మజ్ఞానం లేని మూర్ఖుడు నరకానికి పోయి నానాబాధలూ పడతాడు.

28. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్౹ నేయం సజ్జన సఙ్గే చిత్తం, దేయం దీనజనాయ చ విత్తమ్౹౹

Regularly recite from the Gita, meditate on Vishnu in your heart, and chant His thousand glories . Take delight to be with the noble and the holy . Distribute your wealth in charity to the poor and the needy.

ఎల్లప్పుడూ భగవద్గీతను పఠిస్తూ, విష్ణువు యొక్క వేయి నామాలలోగల రూప, గుణాలను ఆకళింపు చేసుకొనుము. సజ్జన సాంగత్యంలో మనసుపెట్టి, నీ సంపదను దీనజనులకు దానంచేయుము.

29. సుఖతః క్రియతే రామాభోగః, పశ్చాద్ధన్త శరీరే రోగః౹ యద్యపి లోకే మరణం శరణం, తదపి న ముఞ్చతి పాపాచరణమ్౹౹

He who yields to lust for pleasure leaves his body a prey to disease . Though death brings an end to everything, man does not give-up the sinful path.

సుఖ, భోగలాలసత్వంతో చేసే పనుల వలన శరీరం రోగాలపాలై, అంతమౌతుంది. ఈలోకంలో మరణం అనివార్యమైనా, మనషి పాపాలను చేయటం మానడు.

30. అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తితతః సుఖలేశః సత్యమ్౹ పుత్రాదపి ధన భాజాం భీతిః, సర్వత్రైషా విహిఆ రీతిః౹౹

Wealth is not welfare, truly there is no joy in it . Reflect thus at all times . A rich man fears even his own son . This is the way of wealth everywhere.

సంపద వలన అనర్థాలు కలుగుననీ, అది కొంచెమైననూ సుఖమివ్వదనే నిజాన్ని ఎల్లప్పడూ నమ్ముము. ధనవంతులకు తమ పుత్రులనుంచికూడా కీడు జరుగవచ్చును. ఇది సర్వత్రా గల రీతి.

31. ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేకవిచారమ్౹ జాప్యసమేత సమాధివిధానం, కుర్వవధానం మహదవధానమ్౹౹

తాత్పర్యము: ప్రాణాయామము (గాయత్రి మంత్ర పూర్వకముగా ఊపిరిని క్రమముగా పీల్చి, బంధించి, నిదానముగా విడుచు ఒక యోగ ప్రక్రియ), ప్రత్యాహారము (బాహ్యేంద్రియములను నిగ్రహించి, అంతర్ముఖము చేయు ఒక యోగ ప్రక్రియ) శాశ్వతమైన మరియు అశాశ్వతమైన వస్తువివేకము, తత్వ విచారణ, మంత్ర జపములను ఏకాగ్రతతో, బహు జాగ్రత్తగా అవలంబింపుము.


32. గురుచరణామ్బుజ నిర్భర భక్తః, సంసారాదచిరాద్భవ ముక్తః౹ సేన్ద్రియమానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్౹౹

Oh devotee of the lotus feet of the Guru ! May thou be soon free from Samsara . Through disciplined senses and controlled mind, thou shalt come to experience the indwelling Lord of your heart !

గురు చరణారవిందములనే నమ్ముకుని, వెంటనే సంసారమునుండి విముక్తి పొందుము. ఇంద్రియములను, మనస్సును నియమితము చేసుకుంటే మాత్రమే, నీ హృదయంలోనేయున్న పరమాత్మ దర్శనమౌతుంది.

33. మూఢః కశ్చన వైయాకరణో, డుకృఞ్కరణాధ్యయన ధురిణః౹ శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై, బోధిత ఆసిచ్ఛోధితకరణః౹౹

Thus a silly grammarian lost in rules cleansed of his narrow vision and shown the Light by Shankara's apostles.

సంస్కృత వ్యాకరణమందు నేర్పు మాత్రమే పరమావధియనుకొన్న ఆత్మజ్ఞానములేని ఓ పండితుడు, భగవంతునికి శిష్యుడైన శ్రీ ఆది శంకరులవారిచే అంతఃకరణ శుద్ధి గూర్చి ఈ విధముగా బోధింపబడెను.

34. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమతే౹ నామస్మరణాదన్యముపాయం, నహి పశ్యామో భవతరణే౹౹

Worship Govinda, worship Govinda, worship Govinda, Oh fool ! Other than chanting the Lord's names, there is no other way to cross the life's ocean.

గోవిందా, గోవిందా, గోవిందాయని గోవిందుని భజించుము. ఓ మూఢుడా! ఈ జీవితమనే సముద్రమును దాటుటకు భగవన్నామ స్మరణమును మించిన ఉపాయము వేరేదీ లేదు.

Reference https://te.m.wikisource.org/wiki/%E0%B0%AD%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%82

No comments:

Post a Comment