Wednesday, November 30, 2022

భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాము..

 [11/30, 03:24] +91 73963 92086: Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 51,వ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాము...🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇపుడు భరద్వాజ మహర్షిని గురించి తెలుసుకుందాం . సప్తఋషులంటూంటారు విన్నారు కదా ! వాళ్ళల్లో ఒకడు మనం తెలుసుకోబోయే భరద్వాజ మహర్షి .

🌸ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు ' భరద్వాజ తీర్థ ' బృహస్పతి తన అన్నగారైన ఉతథ్యుడింటికి వచ్చాడు . బృహస్పతికి శాపం ఉండటం వల్ల వదిన గారైన మమతని ఇష్టపడ్డాడు .

🌿మమత తప్పని చెప్పినా వినిపించుకోలేదు . మరి శాపప్రభావం కదా ! వీళ్ళిద్దరికీ పుట్టినవాడు ' భరధ్వాజుడు ' మమత నాకిష్టం లేదు కాబట్టి ఈ పిల్లాడ్ని నేను పెంచనంది .

🌸బృహస్పతి నువ్వే పెంచమని మమతకి చెప్పి వెళ్ళిపోయాడు . మరుత్తులు ఆ పిల్లాణ్ణి పెంచుతున్నారు . దుష్యంత మహారాజు కొడుకు భరతుడు చక్రవర్తి వందలకొద్ది అశ్వమేధయాగాలు చేసినా పిల్లలు లేక బాధపడుతున్నాడు .

🌿మరుత్ స్తోకియం అనే యాగం చేశాడు భరతుడు . మరుత్తులు భరద్వాజుణ్ణి భరతుడికి అప్పగించారు . మమత బృహస్పతులు ఇద్దరితో వదిలివేయబడి భరతుడు పెంచినవాడు కాబట్టి భరద్వాజడని పేరు . 

🌸' భరద్వాజుడు ' మహాతపస్వి కదా ! తండ్రి భరతుడితో యజ్ఞాలు చేయించడం వల్ల నలుగురు కొడుకులు కలిగారు . కొంతకాలం తర్వాత భరద్వాజుడు కూడ పెళ్ళి చేసుకున్నాడు . 

🌿కూతురు దేవకర్ణి , కొడుకు మనువు అనే ఇద్దరు పిల్లల్ని పొందాడు . భరద్వాజుడు కొంతకాలం తర్వాత భరతుడి దగ్గర నుంచి గంగాతీరం వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకుంటూ వున్నాడు . 

🌸గంగానదిలో స్నానం చేస్తూ ఒక అప్సరసని చూశాడు . ఆమె వల్ల భరద్వాజుడికి ద్రోణుడనే కొడుకు కలిగాడు . ద్రోణుడు , వృషతుడనే రాజు కొడుకు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు . 

🌿ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు . ద్రోణుడికి వేదవిద్యలు , విలువిద్యలు నేర్పించి ' కృషి ' అనే అమ్మాయినిచ్చి పెళ్ళి చేశాడు భరద్వాజుడు . 

🌸ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు . ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది . భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి అనేక విషయాలు తెలుసుకున్నాడు .

🌿భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు .

🌸ఒకనాడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెడుతూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చాడు . మహర్షి శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిగా గుర్తుచేసి మర్నాడు ఉదయాన్నే బయలుదారి చిత్రకూటానికి వెళ్ళమన్నాడు .

🌿శ్రీరాముడు అరణ్యవాసం అయిపోయాక మహర్షి ఆశ్రమానికి వచ్చి తిరిగి అయోధ్య వెడుతున్నట్లు చెప్పాడు . నువ్వు విష్ణుమూర్తి అవతారమే అయినా నీకేంకావాలో అడగమన్నాడు మహర్షి మహాత్మా ! మీ ఆశ్రమంలో ఉన్నట్లే సాకేతపురం చుట్టూ చక్కటి ఉద్యానవనాలు ఉండేలా చెయ్యమని వరం తీసుకుని అయోధ్యకి బయలుదేరాడు రాముడు .

🌿భరద్వాజుడుకొన్ని యుగాలు తపస్సు చేసి తరువాత తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు . వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు . 

🌸గోపాల బాలకులతోనూ , బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు .

🌿భారద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు . 
పూర్వం మనువంశం వాడయిన వీతహవ్యుడనే రాజుకి వందమంది కొడుకులు . వాళ్ళు కాశేశుడనే రాజుతో యుద్ధం చేసి ఓడించారు .

🌸తర్వాత అతడి కొడుకు సుదేవుణ్ణి రక్షించమని భరద్వాజుణ్ణి అడిగాడు దివోదాసుడు . సుదేవుడి కొడుకు దివోదాసుణ్ణి కూడా ఓడించారు .

🌿భరద్వాజుడు రాజుకి అన్ని విద్యలు తెలిసిన కొడుకు ప్రతపర్ణుణ్ణి అనుగ్రహించాడు . హైహేయుల్ని అందర్నీ చంపగా వీతహవ్యుడు మిగిలి భరద్వాజాశ్రమానికి వెళ్ళి మహర్షిని రక్షించమన్నాడు . 

🌸భరద్వాజుడు తన శిష్యుల్తోపాటు వీతహవ్యుడ్ని ఉండమన్నాడు . ప్రతర్ధనుడు వెతుక్కుంటూ వచ్చి మహర్షి ఆశ్రమంలో వీతహవ్యుడున్నాడేమో అని అడిగాడు . 

🌿మహర్షి అప్పటికే వీతహవ్యుడ్ని బ్రాహ్మణ్ని చేశాడు గనుక ఇక్కడ క్షత్రియులు ఎవ్వరూ లేరని చెప్తే ప్రతర్థనుడు వెళ్ళిపోయాడు . ఈ విధంగా మహర్షి అందర్నీ రక్షిస్తూ ఉండేవాడు .

🌸భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ధ చూపు , కొంగ వినయం , కుక్క విశ్వాసం , సింహ పరాక్రమం , కాకి సంశయం , పాము నడక ఉండాలని , ధర్మకార్యక్రమాలు ఎలా చెయ్యాలో , దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు .

🌿ఒకసారి గొప్ప గొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్తోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు .

🌸ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలు పెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు . ఈ గ్రంధాన్నే ' భరద్వాజ స్మృతి ' అన్నారు .

🌿మీకొక గొప్ప విషయం చెప్తాను . మీరు మీ స్నేహితులకి కూడా చెప్పుకోవచ్చు . ఆశ్చర్యం కలిగించే విషయం .
[11/30, 03:24] +91 73963 92086: 🌸భరద్వాజుడు ' వైమానిక శాస్త్రం ' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని , ఒక గ్రంథం రాశాడు . మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట . 

🌿దీంట్లో ఏమేమున్నాయో చూదం. ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది , నాశనంకాకుండానూ వుంటుంది . 

🌸ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి . ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి . దొరికితే నాక్కూడా చెప్పండి  ! ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా , ఫోటోలు తీసుకోగలిగేలా , శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్ఛపోయేలా చెయ్యకలిగేవి చాలా పరికరాలుంటాయి . 

🌿అంటే ఇవి యుద్ధవిమానాలేమో . విమానానికి 31 భాగాలుండాలనీ . విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ , కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్ధాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు . 

🌸పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట .అంతటి గొప్ప మహర్షి భరద్వాజ మహర్షి..

🌿ఒకనాడు ఇంద్రుడు, ' మహర్షీ !  వేద విజ్ఞానం అపరిమితం.  ఒక్క మహావిష్ణువుకే  వేదసారమంతా తెలుసు. మనం తెలుసుకోవలసింది, వేదముల  ఉపయోగము, 

🌸మానవ జీవితంలో యెంత వరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే. 
అన్నివేదాల పరమార్ధము ఆ 
శ్రీ మహావిష్ణువే. అయన గురించి తపస్సు చెయ్యి. 

🌿ఆయనే నీకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తాడు. 
'  అని చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు తెలుసుకున్నాడు, '  వేదాలను పూర్తిగా గ్రహించడమంటే, శ్రీహరి కైవల్యం పొందడమేనని. ' 

🌸ఇంద్రుడు చెప్పిన విధంగా,  భరద్వాజుడు, శ్రీహరిని ప్రార్ధించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరకు, మట్టపల్లి అనే గ్రామం (  తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా ) వెళ్లి, అక్కడ నిత్యమూ, కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ,  నరసింహ స్వామిని గురించి తపస్సు చేసాడు.  

🌿భరద్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు,  మహర్షికి వైకుంఠ ప్రాప్తి కలుగజేసాడు. 
    
🌸భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవలసిన విషయాలు అపారం. ఇది విహంగ వీక్షణమే.

🌿ఇదండీ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment