కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తే మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి.
మంచి సంపన్న కుటుంబంలో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది.
ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుందీ, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, బాధ ఉన్న చోట ప్రేమ, ప్రేమ ఉన్న చోట బంధం, బంధం ఉన్న చోట భాధ్యత, బాధ్యత ఉన్న చోట బరువు, అనందం ఉన్న చోట అభినందన ఉంటుందీ. స్వార్థం ఉన్న చోట పగ, బాధ అర్ధం అయితే ప్రేమ, తపన ఉంటుంది.
బంధం అర్థమైతే అనందం ఉంటుందీ,వీటినన్నింటిని అర్ధం చేసుకునే మనసుంటే జీవితం అత్యద్భుతంగా ఉంటుంది.
కోపంగా మాట్లాడేవారు గొప్పగా బ్రతకడానికి దారి చూపిస్తున్నారని ఎలా అయితే తెలుసుకోలేమో, అలాగే నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడేవారు, గొంతు కోసేవరకు కూడా మోసం చేస్తున్నారని తెలుసుకోలేము.
ఆలోచనలు అధ్బుతంగా, మనసు నిలకడగా, జీవితం ఉన్నతంగా,ఆహ్లాదకరంగా ఉండాలంటే ఉన్న ఓకే ఒక్క ఏకైక మార్గం సరైన సాధన మాత్రమే చేయండి... ఒక మండలం రోజులు చేసి అనుభవపూర్వకంగా ఎవరికి వారు తెలుసుకోండి... ధర్మో రక్షతి రక్షితః... ద్యానో రక్షిత రక్షితః... ధ్యానో భవ సుఖీ భవ.
కొంత సేకరణ
పసుపుల పుల్లారావు, ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment