🙏🏻 శ్రీ గురుభ్యోనమః🙏🏻
నిత్యస్మరణీయం - 1
🪷🪷🪷🪷🪷🪷
1.విశ్వపరిమాణం
నీ కనుచూపు పారినంత మాత్రమే.
2.నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది.
3.జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడూ కలిపి ఓ పెద్దకల అని ఉండడమే నిజమైన మెలకువ(మోక్షం)
4.'నేను' అని, దానికి ఇంకొక్క అక్షరం కూడా చేర్చకుండా
అక్కడితో ఆగిపోతే, ఆ 'నేనే' పరమాత్ముడు.
5.'అందరూ' అంటూ ఎవరూ లేరు.
ఉండేది నీవొక్కడివే.
6.నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండు.
7.ఉన్నది ఒకే వస్తువు
మాట వరుసకు కూడా రెండవ వస్తువును
అంగీకరించవద్దు.
8.ప్రతి కదలికా భగవంతునిదే.
నేను కదులుతున్నానని భ్రమపడుతున్నావు.
9.సకలమూ పరమాత్మలో ఉన్నది, పరమాత్మయే అయి ఉన్నది.
ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, నేనే అయి ఉన్నాడు.
10.పుట్టువారిలో మొదటివాడను.
గిట్టువారిలో చివరివాడను.
నా ఈ రెండు కార్యముల నెరుగుటకు
నాకు ముందు వెనకలు ఎవ్వరూ లేరు.
"నేను"తప్ప.
11.నాకు జ్ఞానం, నాకు సుఖం అని కాకుండా
నేను జ్ఞానం, నేను సుఖం అని ఉండాలి.
12.కావాలి అంటే బంధం.
వద్దు అంటే మోక్షం.
13.పొందేవాడు సత్యం కాదు.
పొందబడేది దైవం కాదు.
14.ఏ మనస్సయితే సకలాన్ని త్రోసివేస్తుందో, ఏ మనస్సయితే సకలాన్ని తనలో ఇముడ్చుకుంటుందో
ఆ మనస్సే బ్రహ్మము.
No comments:
Post a Comment