Thursday, February 9, 2023

 ఓ 20 సంవత్సరాల క్రితం..
ఓ నలుగురు అబ్బాయిలు.. భద్రాచలం వెళ్లారు..
దేవుడు దర్శనాల్లాంటివి.. ఉంటాయిగా, అయ్యాక గోదావరిలో ఈత కొట్టాలనిపించిందట, 
సరే అని బట్టలు విప్పి ఎక్కడన్నా పెడదామంటే.. అంతకు ముందు రోజు వాన పడ్టం వల్ల ఆ దరిదాపుల్లో నేలంతా బురదగా ఉందిట! ఎట్లా అనుకుంటుండగా అక్కడే ఓ రెండు మూడు బర్రెలు, (గేదలు) ఆ దగ్గర్లో పడుకొని కనపడ్డాయంట! దగ్గరికెళ్లి వాటిని అదిలించి చూసారు..! 
అవి తొణకలేదు, బెణకలేదు!
ఇంకేం.. పిల్లగాళ్ళు ధీమాగా.. ఆ బట్టల్ని ఓ బర్రె కొమ్ములకి చుట్టారుట! హాయిగా ఇతకొట్టారు! 
ఇహ బర్రెలు దగ్గరికి బయల్దేరారు..!👍 ఏమొచ్చిందో ఏమో గాని.. ఈత కొట్టి డ్రాయర్ల మీద దగ్గరికొచ్చిన ఈ పిల్లోళ్ళని చూసిన బర్రెలు ఒక్క ఉదుటున లేచి ఒకటే పరుగు అందుకున్నాయి🤣
వెంటబడీ.. వెంటబడీ.. మొత్తానికి.. ఆ బర్రెని పట్టుకొని బట్టలైతే విడిపించుకున్నార్లే గానీ..
అప్పటికే ఆ బర్రె ఊర్లోకొచ్చేసిందనుకోండీ🤣

నీతి: తెలివితేటలు ఎవడబ్బా సొత్తుకాదు👍😏

No comments:

Post a Comment