*::::::Becoming భవం ::::::*
సింహం. కూర్చోని వుంది. ఆకలి వేసింది. ఎదురుగా జింకని చూసింది. ఆ జింక ఇప్పుడు సింహానికి జింక కాదు. తనకు ఆహారం.
ఆకలి వేటాడమంది. వేట మొదలైంది.
ఇప్పుడు అది మామూలు సింహం కాదు . వేటాడే రౌద్ర ఆకలి గా మారింది. ఆకలి లేనప్పుడు జింకను సింహం ఏమీ అనదు. ఆకలి గా తను మారదు.ఆకలి లేనప్పుడు ఇది సింహం. అది జింక ఆకలి వున్నప్పుడు, ఇది ఆకలి ,అది ఆహారం.
మనమూ అంతే. ఎదురుగా ఏదో వుంది. అది ఏదోగా వున్నంత కాలం మనం మనంగానే వుంటాము.
ఎదురుగా వున్నది అయిష్టం (లేదా కోరిక లేదా ద్వేషం), అయితే మనం అయిష్టంగా మారిపోతాము. అప్పుడిక మనం మనం కాదు .మనం ఇప్పుడు అయిష్టం. ఏమి చేస్తామో మనకే తెలియదు.
ఎందుకంటే చేసేది,చేయించేది అయిష్టం కనుక.
అయిష్టం లేనప్పుడు ఇది మనం ,అది సమ్ థింగ్.అయిష్టంవుంటే ఇది అయిష్టం,అది అయిష్టపడ బడేది
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment