Saturday, February 11, 2023

:::::: ఘర్షణ:::::::

 *::::::: ఘర్షణ:::::::::::::*  
       మనందరి మనస్సు రెండు గా చీలి ఒక భాగం మరోక భాగం తో ఘర్షణ పుడుతూ ఉంటుంది.
     ఒక భాగం సహజ సిద్ధంగా తానేమిటో, తన స్వభావం ఏమిటో,తాను ఎలా వుండటానికి అలవాటు పడిందో అలా వుంటుంది.
    మరొక భాగం ఈ వున్న లేక వుంటున్న, స్థితి నచ్చక మరో లాగా అనగా ఆదర్శాలు, సిద్ధాంతాలు, ఇజం లు, ఊహలు, పెట్టుకొని అలా అవ్వాలని  ప్రయత్నిస్తూ వుంటుంది.
    అనగా ఉంటూ వున్న స్థితికి  వుండాలనుకొనే స్థితి కి మధ్య సంఘర్షణ. పాపం మనస్సు చితికిపోతుంది.
    ఉదా.  ఇప్పుడు మనస్సు ఉన్న స్థితి హింస, స్వార్థం,.
      ఉండాలనుకునే స్థితి అహింస, నిస్వార్థం.
   మనస్సు హింసాత్మకంగానూ, లేదా అహింస గానూ వుండలేదు. ఫలితం ఘర్షణ.
   ధ్యానం మనస్సు ని అలవాటు పడిన స్థితి కాక, ఉండాలనుకొనే స్థితి కాక అసలు ఉండాల్సిన స్థితి అయిన ప్రజ్ఞాస్థితి లో వుంచుతుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment