Wednesday, February 8, 2023

 ✳ 'నేను', 'నాది' అనే భావాలను నాహం కర్తా - హరేః కర్తా అనుచూ పూర్తిగా ఈశ్వరార్పణ భావముతో తుడిచి వేసి శరణాగతితో ఉండడమే 
-  భక్తియోగం. 

✳ సంకల్ప, వికల్పాలను ఎప్పటికప్పుడు సత్కర్మానుష్ఠానము ద్వారా సరిచేసుకుంటూ మనస్సుని శుద్ధి చేసుకోవడమే 
- కర్మయోగం.

✳ బుద్ధిని సునిశితం చేసుకుంటూ, అంటే సాక్షీసాధన ద్వారా నిత్యానిత్య వస్తు వివేకముతో - మోక్షము కొరకు విచక్షణాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవడమే 
- ధ్యాన యోగం.

✳ చిత్తవృత్తులను నిరోధించుకుంటూ నిరతమగు సమాధి ప్రజ్ఞను పొందడమే 
- హఠ యోగం 

✴️ సాంఖ్య - తారక - అమనస్క యోగ విధానమున ఉన్నది బ్రహ్మమని నిశ్చలతన తురీయ నిష్ఠయందుండుటే 
- జ్ఞాన యోగం 

✴️ ఉన్నది బయలు - పరాత్పరము - ఉన్నది అచలమని - నిర్ణయించేవాడు - నిర్ణయము అనే ఎరుక సదా అచలమైన పరబాహ్యమున మూలము లేనిదని పరాత్పరముగా ఉన్నదున్నట్లూరకుండుటే 
- అచల పరిపూర్ణ రాజయోగం

మూడు స్థితులు :-

1. పరమాత్మ వేరు -  జీవుడు వేరు
 ( సముద్రం వేరు, కెరటం వేరు )
2. జీవుడు పరమాత్మలో ని అంశ మాత్రమే.
 ( కెరటం సముద్రంలోని భాగం మాత్రమే )
3. అసలు జీవునికీ పరమాత్మకు బేధం లేదు.
(కెరటం, సముద్రం ఒకటే)
4. పూర్ణాచల సముద్రవత్ గా సర్వము - శూన్యము అనే నిర్ణయము - నిర్ణయించేవాడు లేనివాడు.

No comments:

Post a Comment