💐 *నడక ఆరోగ్యానికి చాలా మంచిది.* 💐
అందుకే రోజూ నేను వైన్ షాపుకు నడిచే వెళతాను.
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది,
అందుకే మందు లోకి స్టఫ్ గా వేయించిన వెల్లుల్లే తీసుకుంటాను.
💐 *ప్లాస్టిక్ పర్యావరణానికి చెడ్డది,* 💐
అందుకే మందు గాజు గ్లాసులోనే త్రాగుతాను, ప్లాస్టిక్ గ్లాసు ముట్టనే ముట్టను.
💐 *అబద్ధం మాట్లాడడం మహా పాపం!* 💐
నాకు తెలిసి నేను ఏనాడు అబద్ధాలు మాట్లాడలేదు, అదేంటో మందులో ఉంటే నిజాలు వాటంతట అవే తన్నుకుని వస్తాయి..
💐 *రోజూ రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిది.* 💐
అందుకే బార్ కట్టేసేవరకు ఉండకుండా ముందే ఇంటికి వచ్చి పడుకుంటాను, ఉదయం 05.00 గంటలకు హ్యాంగోవర్ పెగ్గు కోసం నిద్ర లేస్తాను.(కాదు లేవవలసి వస్తుంది)
💐 *స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ 30 డేస్* 💐
అలాంటి బుక్ లను చూస్తే నవ్వొస్తుంది నాకు.. ఒక్క క్వార్టర్ గొంతులో పడితే అన్ని భాషలు అనర్గళంగా వస్తాయి నాకు.
💐 *ప్రాణాయామం,యోగా చేయడం వలన శరీరం ఉత్తేజితమవుతుంది. వృధ్యాప్యం దరిచేరదు.* 💐
అందుకే గుక్క త్రిప్పుకోకుండా ఒక్కసారిగా గ్లాసు ఖాళీ చేసి ఊపిరి గట్టిగా పీల్చుకుంటా... నావరకు ఇదే ప్రాణాయామం..
ఇక నేను యోగా చేయవలసిన అవసరం లేదు ,ఎందుకంటే మందు ఎక్కువై పడిపోతే నాలో అన్ని యోగాసనాలు కనపడతాయి.
శరీరం ఉత్తేజితమవడం అంటారా దానికి ఒక క్వార్టర్ కొడితే చాలనుకుంటా..
ఇక వృద్ధాప్యం అంటారా అది ఎప్పుడూ నా దగ్గరకే రాదు, ఎందుకంటే ఆ వయసు వరకు నేనెలాగూ బ్రతకను అని నాకు తెలుసు.
💐 *కుల వివక్ష, అంటరానితనం, పేద, ధనిక భేదాలు ఇవన్నీ సమాజం లో అమానుషమైన నేరాలు..* 💐
ఒక్కసారి బారు లోకి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది మా సౌభ్రాతృత్వం అంటే ఏమిటో... మీకు అడిషినల్ గా భిన్నత్వం లో ఏకత్వం కూడా స్పష్టం గా కనపడుతుంది.. అంతలా కలసి, మెలసి ఉంటాం..
ఇంకా ప్రభుత్వాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయంటే దాంట్లో మా పాత్ర కూడా కొంత ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నా ఛాతీ గర్వంగా ఉప్పొంగుతుంది.....
అలాంటి మమ్మల్ని " *త్రాగుబోతు* "అంటేనే మనసులో ఎక్కడో కలుక్కుమంటుంది మేష్టారూ!
***********
No comments:
Post a Comment