Monday, February 20, 2023

**** ధ్యానం చేసే పద్ధతి

 [2/20, 16:27] +91 73963 92086: ధ్యానం చేసే పద్ధతి 

సుఖాసనంలో .. హాయిగా .. కూర్చుని .. చేతులు రెండూ కలిపి .. కళ్ళు రెండూ మూసుకుని .. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే .. ఏకధారగా .. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.

ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

సహస్రార చక్రము: 
******
(గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.

ఆజ్ఞా చక్రము: 
****
రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: 
***
(అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.
అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

అనాహత చక్రము: 
******
(అర్ధమంటపం)
ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.
అర్ధమంటపం : 
***
గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: 
*****
(మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

స్వాధిష్ఠాన చక్రము: 
***
(ధ్వజస్తంభం)
ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ధ్వజస్తంభం : 
***
ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

మూలాధార చక్రము:
****
అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం :
*****
 స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.
[2/20, 16:27] +91 73963 92086: పాదాలు :
***
ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి.

 సర్వేజనా సుఖనోభవంతు..

సేకరణ:-pathangali yoga నుండి

       🙏🙏🌹🕉️🌹🙏🙏

*ఓం అరుణాచలేశ్వరాయః

1. అంతర్ముఖత్వ సాధన

మహావాక్యాలూ, వాటి అర్ధనిర్ణయాలూ అంతులేని చర్చలకు దారితీసి సాధకుల మనస్సులను బహిర్ముఖంగా ప్రసరింపజేస్తూ ఉంటాయి. మనస్సును అంతర్ముఖం చెయ్యాలంటే సాధకుడు సూటిగా “నేను" లో నిలకడ సంపాదించుకోవటం అవసరం. బాహ్య ప్రవృత్తులంతరించి అతనికి అప్పుడు పరమశాంతి చేకూరుతుంది.

2 . అంతా చిద్విలాసం

శివ శక్తులన్నా, ఈశ్వర జగత్తులన్న అంతా శివస్వరూపమే. ఒకటి శివుని అచల స్వరూపం, రెండవది శివుని సచల స్వరూపం, చిద్వస్తువే అటు అచలంగా , ఇటు సచలంగా కూడా ఉంది. చైతన్య స్వరూపులు కానివారెవ్వరు? చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రత్యక్షం కాకపోతే శివుడు ప్రత్యక్షం కాలేదన్నమాటే.

అంతా మాయేనా?

అంతా మాయ, అసత్యమే కాని, సత్య వస్తునేది లేదంటారు కొందరు. కానీ, అంతా అసత్యమని నిర్ణయిస్తున్నది ఎవరు? అసత్యమైతే ఈ నిర్ణయం కూడా అసత్యమే కాదా? సృష్టి వికాశసిద్ధాంతం యిట్టి దృష్టి గల వానిచే ప్రపంచించబడింది. కానీ, అది ఎక్కడ ఉన్నది? మనస్సులో కాదా?

అందరూ గురువులే

లోకంలో చెడ్డ వారు, మంచివారు - అందరూ మన కు గురువులే, చెడ్డవారు తమ చెడ్డపనుల ద్వారా  "నాచెంతకు రాబోకు' మని బోధిస్తూ ఉంటారు. మంచివారెప్పుడూ మంచివారే కదా. కనుక లోకంలో అందరూ మనకు గురువులవంటివారే.

అకర్మ

అకర్మ అనగా కర్మగాని కర్మ. అహంకారం నిర్మూలమైన తరువాత చేయబడే కర్మే అకర్మ.

ఆజ్ఞానం - ప్రజ్ఞానం

సుషుప్త్యవస్థ అజ్ఞాన మంటూ వుంటారు. కానీ, జాగ్రదావస్థలోని వీపరీత జ్ఞానాన్ని బట్టి దానిని అలా అనడం జరుగుతుంది. జాగ్రదావస్థయే నిజానికి అజ్ఞానం. సుషుప్యవస్థ ప్రజ్ఞానం. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. సుషుప్తిని అనుభవించేవాడు ప్రజ్ఞానం. మూడు అవస్థల్లో కూడా అతడు ప్రజ్ఞానమే అయినా, సుషుప్తిలో ప్రజ్ఞాన ఘనుడు.

అజ్ఞాన వినాశం

సూర్యరశ్మికి దూది తగులబడదు, భూతద్దం క్రింద దానిని ఉంచినప్పుడు మాత్రం, భూతద్దం ద్వారా ప్రసరించిన సూర్యకిరణాల కది నిప్పంటుకొని తగులబడి పోతుంది. అట్లే ఆత్మ యొక్క ఎరుక సర్వకాల సర్వావస్థలలోనూ ప్రకాశిస్తూ వుండేదే అయినా, జీవుని అజ్ఞానాన్ని మాత్రం అది నశింపచేయదు. ధ్యానసాధన ద్వారా చిత్తవృత్తి రాహిత్యపూర్వకమైన విశుద్ధ అహంస్ఫూర్తిని సాధించినప్పుడు అజ్ఞానం పూర్తిగా నశంచి పోతుంది.

అజ్ఞానానికి ఆధారం

సర్వమూ ఆత్మ పై ఆధారపడినదే. ఆత్మ పైన ఆధారపడనీది ఏదీ లేదు. ఏమంటే, అజ్ఞానం కూడా ఆత్మశక్తి విశేషమే. ఆత్మను బాధించ కుండా అది ఆత్మయందు గోచరిస్తుంది. అయితే, దానిచేత బాధించబడేవాడు అహంకార విశిష్టుడైన జీవుడు. కనుక, అజ్ఞానం జీవునిది.

అద్వయ సుఖం

గాఢనిద్ర కూడా అద్వైత స్థితియే. జీవాత్మ పరమాత్మల భేదం అక్కడ లేదు. అన్ని భేదాలనూ మరచే స్థితి అది. అలా మరవడంలోనే సుఖమున్నది. ఆ సుఖం సంపాదించడం కోసమై జనులు మెత్తని పరుపులూ దిండూ మొదలైన వాటిని ఏ విధంగా సిద్ధం చేసుకుంటారో చూడండి. మెలకువ పోయి కమ్మని నిద్ర తెప్పించుకోడానికి ప్రయత్నమిది. కానీ, గాఢ నిద్రలో ఈ మెత్తని పరుపులు మొదలైన వాని అక్కర ఏమీ లేదు. దీని అభిప్రాయమేమంటే, సకల ప్రయత్నాలూ అజ్ఞాన  నీర్ములనకే. జ్ఞానోపలబ్ది అయిన తరువాత ఇక ఏ  ప్రయత్నాలతోనూ పని లేదు.

అధికార భేదం - ధ్యాన పద్ధతి

సాధకుని అధికార భేదాన్ని బట్టి ధ్యాన పద్ధతి మారుతూ వుంటుంది. పట్టుకోగలిగితే నీ లోపల ఆలోచించే వానిని సరాసరి పట్టుకో, అప్పుడా ఆలోచించేవాడు తనకు మూలమైన శుద్ధ చైతన్యంలో తనంత తాను లీనమైపోతాడు. ఆ పద్ధతి కుదరకపోతే ఈశ్వర ధ్యానం చెయ్యి, అది నిన్ను పరిశుద్ధుని గావించి, నీలో ఆలోచించే వానిని పట్టుకోగలిగేటట్టు చేస్తుంది. తద్ద్వారా శుద్ధ చైతన్యంలో నీవు లీనం కాగలుగుతావు.

అభయ స్థితి

భయమనేది ఒక చిత్తవృత్తి. ఆత్మకంటే రెండవ వస్తువేదైనా ఉంటే భయపడడం యుక్తమే. కానీ, ఈ రెండవ వస్తువును చూస్తున్న దేవరు? మొదట అహంకారం తలయెత్తి ఆ పైన విషయాలను తన వెలుపల ఉన్నట్టు చూస్తుంది. అహంకారం తలయెత్తక పోతే ఉన్నది ఆత్మ ఒక్కటే, - రెండవదీ లేదు.
[2/20, 16:28] +91 73963 92086: ఆత్మస్థుడైన వానికి అహంకారాన్ని ఆశ్రయించుకొని బయలుదేరే సంశయాలూ భయాలూ మొదలైనవి ఏవీ ఉండవు.

అభ్యాసం

ఆలోచనవలన విక్షేపం పొందినప్పుడెల్ల, ఆత్మలోకి ఉపరమించే ప్రయత్నం చెయ్యడం అభ్యాసం. అది మనస్సును ఏకాగ్రం  చెయ్యడమూ కాదు. వినాశం పొందించడమూ కాదు. కేవలం ఆత్మలోనికి ఉపరమించడం. తీవ్రంగా ఆలోచించగలిగితే మనస్సు చాలా బలంగా వున్నట్టు సామాన్యంగా అనుకుంటూ వుంటారు. కానీ, జ్ఞాన సాధనలో ఏ ఆలోచనలూ లేకుండా ఉండగలిగినప్పుడే మనస్సు చాల బలంగా ఉన్నట్టు. సాధకుడు తాను ఆత్మగా ఉండిపోవడం నేర్చుకోవాలి. ఆది చేతగానప్పుడు "నేను" అనే దాని నిజతత్త్వం విచారం చేసుకుంటూ ఇతరాలోచనలు వచ్చినప్పుడెల్ల తిరిగి దానినే చిక్కబట్టుకుంటూ రావాలి. ఇదే అభ్యాసం.

అరిషడ్వర్గ విజయం

కామాది అరిషడ్వర్గాన్ని ఎలా నిగ్రహించడం? ఈ ఉద్వేగాలు ఎవరివో కనుక్కో. నీవు ఆత్మస్థుడవై ఉండగలిగితే ఆత్మకంటే వేరుగా నీ కేదీ కనిపించదు. అప్పడు నిగ్రహంచడమనే ప్రసక్తికే అవకాశం వుండదు.

  'అసలు నేను'

*"అసలు నేను" చూడబడే వస్తువు కాదు. చూడబడేది, చూచేది, చూపు - - మూడూ దాని అభివ్యక్తులు. ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేది ఏమీ ఉండదు. ఎరుక యే దాని స్వస్వరూపం. దాని వెలుగులోనే శరీరం, అహంకారం, ప్రపంచం మొదలైనవన్నీ ప్రకాశిస్తాయి.*

ఓం నమే భగవతేశ్రీరమణాయ

(సేకరణ)

No comments:

Post a Comment