Friday, February 10, 2023

శ్రీరమణీయం: నేను అని భావిస్తున్న దానికి, శాశ్వత ఉనికికి అనంతరం ఉందా ? ఉంటే ఎలా ఉంది !?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"465"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"నేను అని భావిస్తున్న దానికి, శాశ్వత ఉనికికి అనంతరం ఉందా ? ఉంటే ఎలా ఉంది !?"*

*"అవగాహన లోపమే ఈ ప్రశ్నే తలెత్తడానికి కారణం. ఎలాగంటే బంగారంతో నగ తయారవుతుంది. అంటే బంగారమే నగ రూపంగా మారుతుంది. ఆ 'రూపం' బంగారాన్ని మార్చడం కానీ, 'రూపమే' బంగారంగా మారటం గాని జరగలేదు. నగరూపంలో 'ఉన్నా లేకున్నా' బంగారానికంటూ ఒక శాశ్వత ఉనికి ఉంది. అలాగే ఇప్పుడు నిజంగా కనిపించే మన బాహ్యరూపం ఉన్నా, లేకున్నా మనకు కూడా ఒక ఉనికి ఉంది. విలువ ఎప్పుడూ బంగారానికే ఉంటుంది.  మన అభిరుచి మాత్రమే వస్తువుపై ఉంటుంది. 'నాకు బంగారపు ఉంగరం చేయించుకోవాలని ఉంది, ఏ దేవుడి రూపంతో చేయించుకోమంటారు ? అని అడుగుతారు. ఇక్కడ మొదటి విలువ శాశ్వతమైన బంగారానికే ఇచ్చారు. రెండవ విలువ తన అభిరుచి అయిన దాని రూపానికి ఇచ్చారు. మనం కూడా బంగారంలా ఉన్న హృదయంలోని శాశ్వతమైన పరమాత్మ గుర్తించాలి. అప్పుడు ప్రాపంచిక విషయాల ప్రయోజనం అర్థమై, మనమే వాటికి ఇచ్చే ప్రాధాన్యతను తగ్గిస్తాము !"*

*"{ఆధార గ్రంథం :  "శ్రీరమణీయం"}"*

No comments:

Post a Comment