*:::::::::::: జాగ్రత్తలు ::::::::::::*
మనం చిన్నతనం నుండి అనేక జాగ్రత్తలు పెద్దల చేత చెప్పించుకుంటూ తిట్లు తింటూ పెరిగి పెద్దవాళ్ళమైనాము.
ఆ జాగ్రత్తలన్నీ, ఆ తిట్లు అన్నీ మనకు ఉపయోగపడినవో లేదో గాని మన మనస్సు మాత్రం ఇంకా మోస్తూనే వుంది.
అప్పుడు పెద్దలు జాగ్రత్తలు చెప్పినారు . ఇప్పుడు మన మనస్సు ఆ పెద్దలగా మారి మనకు చెపుతుంది. అసందర్భంగా. అందుకే నేను అంటాను . పెద్దలే మనస్సు, మనస్సే పెద్దలు.
మన నెత్తి మీద వున్నది మన మనస్సు కాదు .మన పెద్దలు, మనస్సు రూపంలో.
ఉదాహరణకు పిల్లవాడు నడక నేర్చేటప్పుడు వినిన జాగర్త ఇప్పుడు కూడా మనస్సు అంటుంది.
అనగా మనస్సు వాస్తవం గ్రహించే స్థితిలో లేదు.
అందుకే భయం, కంగారు ఆందోళన. కీడు ఎంచే (కీడించే) మనస్సు ఈ జాగ్రత్తల నుండే పుట్టింది.
ధ్యానం చేయండి, అన్నీ చెరిపేయండి
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment