2809. 1-3. 310123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఓం శ్రీ ఆంజనేయాయ నమః*
➖➖➖✍️
*శ్రీ ఆంజనేయ స్వామివారి మహిమ తెలిపే ప్రత్యక్షంగా జరిగిన ఒకప్పటి విషయము:*
*అవి బ్రిటీష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయము. 1832 వ సంవత్సరము.*
*ఎడ్వర్డ్ అనే అతను తిరుచ్చిరాపల్లిలో కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన కావేరీ నదిపై ఆనకట్ట (నేటి Grand Anaicut near Thanjavur) కట్టాలని సంకల్పించి ఆ పనిని రామస్వామి అనే కాంట్రాక్టర్ కు అప్పగించారు.*
*ఆ రామస్వామి పరమ ‘రామ’ భక్తుడు.*
*అతను డ్యాం కట్టే పనిని ప్రారంభించాడు. మొదటి వరుస కట్టడం పూర్తి అయినది.*
*కానీ ఆరాత్రికి కావేరీ పొంగి ఆ కట్టడం కొట్టుక పోయింది. రామస్వామి దిగులు పడి.. మరలా కట్టించాడు.* *దురదృష్టవశాత్తు ఆ వరుస కట్టడం కూడా కొట్టుక పోయింది. రామస్వామికి ఏంచేయాలో పాలుపోలేదు.*
*ఆ కలెక్టరేమో చండశాసనుడు. నిర్ణీత సమయంలో ఆపని పూర్తిచేయాలని శాసించాడు.*
*ఆ రోజు రాత్రి.. రామస్వామి ఆ కట్టడం జరిగే స్థలంలో నిదురించాలని ఉపక్రమించాడు. పడుకుంటే, తలకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించి లేచి.. ఆ గుచ్చుకున్న రాతిని పెకలించి చూస్తే..., అది 'శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం'.*
*రామస్వామికి కంట్లో నీరు వచ్చాయి. అయ్యో, ఓ ఆంజనేయా, దైవమా.. నిన్ను విస్మరించానే. క్షమించు. అని పరిపరి విధాలా స్వామిని ప్రార్థించి, వెంటనే స్వామిని అచ్చటనే ప్రతిష్ఠించి, వేడుకున్నాడు….“ఈ సారి, కట్టడం కొట్టుకొని పోకుండా నిలబడేటట్లు చేయు తండ్రీ, నీకు గుడి కట్టిస్తాను” అని మొక్కుకున్నాడు.*
*అద్భుతం, ఈ సారి కట్టడం కొట్టుక పోలేదు. రామస్వామి, వెంటనే గుడి కట్టడం మొదలు పెట్టాడు.*
*అంతలో కలెక్టర్ జమాబందీకి వస్తున్నాడని వార్త. రామస్వామికి భయమేసింది. ఒక వరుస కట్టడం మాత్రమే అయ్యింది.*
*సరే ఏమయినా సరే, ఆ దైవమే చూసుకుంటాడనే భావనతో, గుడికట్టే పనిలో నిమగ్నమయ్యాడు.*
*కలెక్టర్ వచ్చాడు. ఇంచుమించు రెండు నెలలు అయ్యింది. కాంట్రాక్టరేమో డ్యాం పని ఆపి గుడి కట్టుచున్నాడు. కలెక్టర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. రామస్వామిపై విపరీతమైన కోపం వచ్చింది. “ప్రభుత్వపు పనులు ఆపి గుడి కట్తున్నావా. You Indians are idiots, you pray MONKEY GODS.. “ అంటూ అదే కోపంతో అక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ విగ్రహాన్ని పెకలించాలని ప్రయత్నించాడు.*
*ఇంతలో ఒక అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎక్కడనుంచి వచ్చాయో గండు కోతులు….రావడం రావడం కలెక్టర్ పైకి దుమికాయి. అతని గుర్రాన్ని తరిమాయి. కోటును చించాయి. శరీరాన్ని రక్తం వచ్చేటట్లు బరికాయి.*
*కలెక్టర్ భయభ్రాంతుడయ్యాడు. వెంటనే రామస్వామిని, తన బంట్రోతులను ఆ కోతులను తరమమని ఆజ్ఞాపించాడు. వారు తమవల్ల కాదని.. ఆ ఆంజనేయ స్వామినే వేడుకోమన్నారు. *
*కలెక్టరుకు తన తప్పిదం తెలిసి వచ్చింది. వెంటనే ఆంజనేయస్వామి పాదములకు సాష్ఠాంగ నమస్కారములు చేసుకొని, ఇకపై ఈగుడిని తను కట్టిస్తానని ప్రార్థించాడు.*
*వెంటనే Government Gezette Notification జారీ చేశాడు. *
*అప్పుడు అక్కడ చేరిన కోతులన్నీ అదృశ్యమయ్యాయి. అదంతా ఆ స్వామి వారి మహిమే అని అందరూ పొంగిపోయారు. *
*గుడి కట్టించారు.*
*తర్వాత అనతికాలంలోనే డ్యాం పని కూడా పూర్తయ్యింది.*
*మనం ఈ స్వామి వారి గుడిని, ఆ డ్యాం కట్టడం క్రిందుగా చూడవచ్చు. అందులో కలెక్టర్, కాంట్రాక్టర్ పేర్లను ఒక ఫలకంపై లిఖించి వున్నారు.*
*ఇప్పటికీ మనం Tiruchiraapalli Collectorate లో.. సుమారు రెండువందల సంవత్సరాల క్రితపు గెజిట్ ను చూడవచ్చు.*
*ఓం శ్రీ రామాయనమః*
*ఓం శ్రీ ఆంజనేయాయ నమః*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment