💖💖💖
💖💖 *"463"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"విగ్రహాన్ని విగ్రహంగా కాకుండా దైవంగా గుర్తించటం ఏమిటి ? అది కేవలం భావనే కదా !?"*
*"అదే భక్తి అంటే ! మనం దైవాన్ని గుర్తించాలంటే ఒక రూపం ఉండాలి. అది ముందు మన హృదయంలో భావనగా ఉండాలి. అప్పుడే ఆ రూపం మనకు పూజనీయం అవుతుంది. సిమెంటుతో ఒక అందమైన దేవుని విగ్రహం తయారైంది. ఒక భక్తుడు అందులో దైవాన్ని చూస్తాడు. భక్తుడు కాని వాడు సిమెంటు శిల్పకళను చూస్తాడు. దీన్నిబట్టి భక్తుడు కొలిచే దైవం ఎదురుగా ఉన్న విగ్రహంలో వుందో భక్తుడి హృదయంలో ఉందో అర్థమవుతుంది. కృష్ణుడి విగ్రహం సిమెంటుతో తయారైనా మనం దండం పెట్టాలి అంటే ఆ విగ్రహంలోని కాళ్ళకే పెడతాం. విగ్రహంలోని పిల్లనగ్రోవికి పెట్టం. చిన్ని కృష్ణుడికి రూపాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తే బుగ్గపై పెడతాం. కిరీటానికి పెట్టం. విగ్రహం మొత్తం సిమెంటుతోనే తయారు అయినప్పటికీ అందులోని పూలదండ బాగుందంటూ వేరుచేసి చెప్తాం. అంతేగాని ఆ దండరూపంలో కనిపిస్తున్న సిమెంట్ బాగుందని అనం. ఇక్కడ సిమెంట్ ఏకత్వంగానూ, రూపం భిన్నత్వంగానూ ఉంది. మన ఆత్మలోని విక్షేపణగుణం వల్లనే ఏకత్వంలో ఆ భిన్నత్వం కనిపిస్తుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment