ముందుగా అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రత సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అది ఎలాగో తెలుసుకుందాం.
అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు.
కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాష పర్వతంతో ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు.
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
శివరాత్రి ..”శివ” అంటే “శివుడు; – “రాత్రి” అంటే “పార్వతి” వీరిద్దరికీ వివాహమైన రాత్రే “శివరాత్రి”. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను “ఆదిదంపతులు” అన్నారు.
వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే “శివరాత్రి” విశ్వానికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ “శివరాత్రి” నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని “లింగోద్భవ” కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినం నాడే “శివపార్వతులకు” కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.
అభిషేకం ఎందుకు చేయాలి ?
”అభిషేక ప్రియం శివః” అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే - “నీరము” అంటే “నీరు” నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును “నారాయణుడు” అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు “నీరు” అంటే చాలా యిష్టం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః” శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ … చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న “జలాభిషేకం” అంటేనే శివునకు ప్రీతికరం. అందులోనూ “గంగా జలాభిషేకం” అంటే మహా యిష్టం. ఎందుకంటే “గంగ” “విష్ణుపాదోద్భవ” విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు. ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం “చితాభాస్మాభిషేకం” ఎందుకంటే ఆయన “చితాభస్మాంగదేవుడు” కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో “మహాకాలేశ్వరునికి” ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమయినా, శివాభిషేకం … సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం
ఎందుకంటే ”జలధార శివః ప్రియః” అన్నారు కదా! ఈ అభిషేకాన్ని “రుద్రైకాదశిని” అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి. నమకంలోని “నమశ్శివాయ” అను పంచాక్షరీ మంత్రంలో ”శివ” అనే రెండు అక్షరాలు “జీవాత్మ” అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి ”శివాభిషేకం” అత్యంత ఉత్తమైన సులభమార్గమని, “వాయుపురాణం” చెబుతుంది. “వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః” అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది.
నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు. అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
“శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |
ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||
యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క “శివరాత్రి” అర్చనవలన లభిస్తుందని” “శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు “మాఘబహుళ చతుర్దశి” శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి.
నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, “ఓం నమశ్శివాయ” అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.
బిల్వపత్రాల విశిష్టత.
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం … అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.
సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని ”బిల్వాష్టకం” లో చెప్పబడింది.
“ఏకబిల్వం శివార్పణం” అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి. బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
గమనిక
శివలింగానికి కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించడం మంచిది కాదు.
మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను ఎప్పటికీ సమర్పించకూడదు.
శివ లింగానికి ప్యాకెట్ పాలు సమర్పించకూడదని గుర్తుంచుకోవాలి. ఆవు పాలు మాత్రమే శ్రేష్టమైనవని గుర్తుంచుకోవాలి.
పురుషుడు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి.
శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి.
శివలింగానికి అభిషేకం సమయంలో స్త్రీలు శివలింగాన్ని తాకరాదు.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment