మానవ జన్మ సార్థకం ఎలా అవుతుంది ...
మనిషిని చెడగొట్టేవి నాలుగు!!
‘నేను, నాది, నువ్వు, నీది’ అనే మాటలు.
వాటికి మనసులో స్థానం ఇవ్వనంత వరకు, అతడు అజేయుడే!
ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం - కవచం లేకుండా యుద్ధమైదానంలో నిలుచునే సైనికుడి లాంటిది.
కోరికల్ని తగ్గించుకున్న కొద్దీ మానవుడికి నిబద్ధత పెరుగుతుంది.
అదే అతడికి విజయకేతనం అందిస్తుంది.
మనిషి సమాజంలో జీవిస్తున్నాడు.
రుషులు ఒంటరిగా అడవుల్లో కూర్చుని సామాజిక శ్రేయస్సు కోసం తపస్సు చేశారు.
సమాజం మధ్యనే బతుకుతుండే వ్యక్తి ప్రతి వస్తువుకూ ఇతరుల మీద ఆధారపడుతున్నాడు.
ఆ కృతజ్ఞత అతడికి ఉండాలి, అప్పుడే ప్రేమ అంకురించి మహావృక్షమై విశ్వానికి సత్ఫలాలు ఇవ్వగలుగుతుంది...
మనిషి జన్మ సార్థకమవుతుంది!!...
చేస్తున్న కొద్దీ పెరిగేది ధర్మం,
ఇస్తున్న కొద్దీ పెరిగేది దానం,
ఈ రెండూ మనిషి చేసే జీవనపోరాటంలో, అతడికి లభించిన దివ్యాస్త్రాలు!!...
అప్పుడు మనిషి ఒంటరివాడు కాడు,
అసహాయుడు అసలే కాడు, అనాథ అంతకన్నా కాడు, అతడికి ఎవరూ తోడు ఉండాల్సిన అవసరమూ లేదు, అతడే ఒక సైన్యం!
అతడే ఒక ఋషి, దైవం.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment