Friday, September 1, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺 🌹 *Chapter -- 2:-- ప్రేమ -- అహంకారం

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2:--  ప్రేమ -- అహంకారం* 🌹
🌷 *Part -- 1* 🌷

🌳 గొప్ప అన్నది కేవలం అహంకారానికి మాత్రమే పరిమితం - *'ప్రేమకు'* మాత్రం పెద్దా చిన్నా తేడాలుండవు ! తనను ఆశ్రయించిన వాళ్ళనందరినీ ప్రేమ సము దృష్టితోనే ఆప్యాయంగా స్వీకరిస్తుంది ! 

🌿 ప్రేమ ఎప్పుడూ వినయంగా క్రిందికి వంగేందుకు సిద్ధంగానే ఉంటుంది *"అహంకారం"* క్రిందికి ఏ మాత్రం వంగేందుకు ఒప్పుకోదు. 

☘️ తనను తాను అర్పించు కోవడానికి *"ప్రేమ"* సంతోషంతో సిద్ధపడుతూనే ఉంటుంది. అన్నింటినీ లాక్కుంటున్నప్పుడు మాత్రమే *"అహంకారానికి"* సంతోషం లభిస్తూ ఉంటుంది.

🍀 ప్రేమ అనే పుష్పాల కిరీటం ధరించిన వాడు ఎప్పుడూ రాజులాగే ఉంటాడు. కానీ, *"అహంకారం"* అనే ముళ్ళ కిరీటాన్ని తలకు చుట్టుకున్నవాడు ఎప్పుడూ దరిద్రంతో దీనంగానే ఉండక తప్పదు.

🌼 తన వల్ల ఎవరికైనా సుఖం లభిస్తే *"ప్రేమ"* ఎంతో సంతోషిస్తుంది ! తన వల్ల ఎవరికైనా ఇబ్బంది, దుఃఖము కలుగు తూంటే అహంకారానికి ఆనందం కలుగుతుంటుంది ! 

🍁 *"ప్రేమ"* నిరంతరం ఎదురు చూస్తునే ఉంటుంది. తనను ఎవరితోనూ పంచుకోలేకపోతే, తను ఇవ్వలేకపోతే *"ప్రేమ"* దిగులు చెందుతుంది. తనను తాను పంచుకోగలిగితే *"ప్రేమ"* సంతోషంతో కృతజ్ఞతా భావాన్ని పొందుతుంది. తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడు *"ప్రేమ"* బ్రహ్మనందాన్ని అనుభవిస్తుంది ! *"అహంకారానికి"* ఎప్పుడూ దేన్నో ఒక దాన్ని సాధించాలనే తీవ్ర ఆకాంక్ష ఉంటుంది. ఏదో ఒకటి నేరవేరే అవకాశం కన్పిస్తేనే అహంకారం  ముందుకు నడుస్తుంది. కానీ, *"ప్రేమ"* కు ఇంకో దాన్ని పోందాలన్న తలంపు కూడా ఉండదు. ప్రేమకు తనకు తానే ఓ బహుమానం.



🌷 *Part -- 2* 🌷

🌷 ఉన్న దాన్ని దాచి ఉంచుకోవడం *"ప్రేమ"* స్వభానం కాదు .ఏ ఆంక్షలూ లేకుండా సర్వస్వాన్ని అర్పిస్తుంది. అహంకారం అన్నింటినీ ప్రోగు చేసుకుంటూ ఉంటుంది.

🌳 తను ముక్కలై పోయినా ప్రేమకు ఆనందంగానే ఉంటుంది. *"అహంకారం"* ధనాన్ని కోరుతుంది - ఎందుకంటే డబ్బుతో దానికి శక్తి లభిస్తుంది. కనుక. అనుకున్న దాన్ని పొందినా *"అహంకారానికి"* సంతోషం కలుగదు. అహాంకారానికి అత్యాశ అధికం.

🌿 ఇష్టమైన వారి కోసం తన అంగాల్ని తెగగొట్టుకోవడానికి కూడా అది సిద్దమే. *"ప్రేమ"* అంటే ఇవ్వడం: ఇచ్చేందుకు "ప్రేమ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. అహంకారానికి ప్రేమ ఓ *'పిచ్చి'* లాగా మాత్రమే కనిపిస్తుంది. 

☘️ ప్రేమ నిరంతరంగా సాగే విరాళం. ప్రేమ ఎప్పుడూ ఓ రాజుగా, రారాజుగానే ఉంటుంది! ప్రేమ కంటే గొప్ప చక్రవర్తి ఎవరున్నారు? *"అహంకారం"* ఎప్పుడూ ఏదయినా ఎక్కడయినా లభ్యమౌతుందని తెలిస్తే దానికోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఏమీ లభించని చోట్లకు *"అహంకారం"* పోనేపోదు *"అహంకారం"* నిరుతరం బిచ్చమెత్తుకుంటూనే ఉంటుంది. ప్రతిదీ దానికి కావాలి . 

🍀 *"అహంకారానికి" 'స్వీకరించే భాష'* మాత్రం వచ్చు. ' *'సమర్పించే భాష'* ప్రేమది.

🌼 ప్రేమకు మూల గ్రంథాలు లేవు. ప్రేమను వివరించగలిగే సూత్రాల పట్టికలు లేవు. ప్రేమకు నిఘంటువులు లేవు. ప్రేమకు ఆనుసరించాల్సిన విధుల క్రమాలు లేవు.     ప్రేమను గురించి నేను మీకు ఎలా చెప్పాలి - ఎంత చెప్పగలనోననే విస్మయ, విచిత్ర ఆలోచన నాలోనూ కలిగింది. ప్రేమను మాటలతో వర్ణించడం ఎంతో కష్టతరమైన విషయం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🍁 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

No comments:

Post a Comment