*సత్సంగం*
ప్రతిదేశానికీ ఓ జెండా ఎలా ఉంటుందో
అలాగే ప్రతి మతానికీ ఓ ప్రధాన పవిత్ర గ్రంథం ఉంటుంది
హిందూ సనాతన ధర్మానికి భవద్గీత అలాంటిది
భగవంతుడు మన మీద ప్రేమతో రాసిన ప్రేమలేఖ భగవద్గీత
అందులో 18 ప్రేమలేఖలు ఉన్నాయి
మన జీవితంలో మనం దేనికీ కృంగిపోకుండా ధైర్యంగా ఉండేందుకు ఇవి ఉపయోగిస్తాయి
ఇంకా చాలా గీతలు ఉన్నాయి
గోపికా గీత, భ్రమర గీత, వేణు గీత, యుగళగీత ,శ్రుతి గీత, కపిల గీత ,ఉధ్ధవ గీత, అష్టావక్ర గీత ,శివ గీత, శ్రీదేవి గీత,
అను గీత, హంస గీత,దేవీ గీత, గణేశ గీత ఇలా అనేక పురాణాల్లో ఉన్నాయి
గీతలన్నిటి పరమార్థం ఒక్కటే
మనిషికి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని బోధించటమే
వేదాంత గ్రంథాలు రెండు రకాలుగా ఉన్నాయి
పతంజలి యోగ సూత్రాల లాంటి పాఠ్య గ్రంధాలు ఒకరకం
రెండో రకం పారాయణ గ్రంథాలు
భగవద్గీత 18 వ అధ్యాయంలో 69 ,70 వ శ్లోకాలలో గీతా పఠనం ,గీతాశ్రవణం ,
గీతా బోధన పుణ్య కార్యాలని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు
భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి
భవద్గీతను నిత్యం స్మరించడం చక్కటి సుకర్మ అవుతుంది
ప్రయాణాలలో, ఇంటి పనులు చేసుకునేటప్పుడు, వేచి ఉన్నప్పుడు, పెళ్లిళ్ల లాంటి వాటికి హాజరైనప్పుడు
ఇలా ఎన్నో సందర్భాలలో గీతని మననం చేసుకోవచ్చు
బాగవుదాం అనుకునేవారు భాగవతం చదువుతారని ప్రతీతి
ఇది భగవద్గీతకు కూడా వర్తిస్తుంది.
విత్తనం పాతి ,మొలకెత్తి, పెరిగితేనే విత్తనాలకు జీవం ఉందని మనకు తెలుస్తుంది
అలాగే భగవద్గీత కూడా జీవం ఉన్న విత్తనం
దీనిని మెదడులో పాతితే ఈ మొక్క పెరిగి జ్ఞానం అనే ఫలాన్ని ఇస్తుంది
భగవద్గీత బుక్ షెల్ఫ్ లోనో, పూజా గదిలోనో ఉంటే లాభం లేదు
అది మనకు మేలు చేయాలంటే శ్రద్ధగా చదివి అందులో చెప్పింది ఆచరిస్తే
అప్పుడది మనకి సత్ఫలితాలను ఇస్తుంది
No comments:
Post a Comment