Friday, November 3, 2023

’భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు...

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *’భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మ కు ఏవిధంగానూ నాశనం ఉండదు. మనిషి చేసిన పుణ్య /పాప కర్మలు వాసన రూపంలో ఒకదానిమీద ఇంకొకటి పేర్చబడి, సూక్ష్మరూపంలో మరుసటి జన్మలో ఈ ఆత్మ ధరించిన దేహాన్ని చేరుతాయి.*
💖 *”కర్మఫలం” పూర్తిగా ‘అనుభవించడం’ పూర్తి అయ్యే వరకూ ఏదో ప్రాణిగా జన్మలు ఎత్తక తప్పదు. ప్రస్తుత జన్మలో అనుభవించగా మిగిలిన కర్మలు తదుపరి జన్మకు Carry forward ఔతాయన్నమాట.*
❤️ *కర్మననుభవించాలంటే ఖచ్చితంగా శరీరం కావాలి. శరీరం కావాలంటే జన్మ ఎత్తక తప్పదు. ఇలా పలుజన్మలనుండి అనుభవించకుండా Pending లో ఉన్న కర్మలనే “సంచిత కర్మలు” అంటారు. ప్రస్తుతం అనుభవంలోకి ప్రవేశించిన కర్మలను “ప్రారబ్ధ కర్మలు” అనీ, భవిష్యత్తులో చేయబోయే కర్మలను “ఆగామి కర్మలు” అనీ అంటాం.*
💕 *మనమిప్పుడే అనుభవించేస్తున్నాం కనుక, “ప్రారబ్ధ కర్మల” వలన ఇబ్బంది లేదు. భవిష్యత్తులో చెడ్డ పనులు చేయడం మానేస్తే “ఆగామి కర్మల” సమస్యా ఉండదు. కాగా ఇక మిగిలినవి “Recurring Deposit” “సంచిత కర్మలు" మాత్రమే.*
💞 *ఈ సంచిత కర్మలు ( Old stock) అనుభవించకుండా మాఫీ చేసుకోవడానిక్కూడా, “భగవద్గీత”లో మార్గం సూచించబడింది. “నేను ఈ శరీరాన్ని కాదు. భగవంతుని అంశతో ఈ శరీరంలో శ్వాస/ ఆత్మ రూపంలో ఉన్నాను. ఈ శరీరం చేసే కర్మల మంచితో కానీ, చెడుతో కానీ నాకు సంబంధమే లేదు. నాకేవిధమైన కోరికలు లేవు. ‘పరమాత్మ’లో నేను లీనమవ్వడమే ఏకైక లక్ష్యంగా దైవచింతన చేస్తున్నాను.” అని భావించి, ఐహిక /భౌతిక బంధాలకు దూరంగా చిత్తశుద్ధితో భగవంతుణ్ణి శరణాగతి కోరితే ఆభగవంతుడు ప్రసాదించే "జ్ఞానాగ్ని"లో ఈ సంచిత కర్మలు దగ్ధం చేయబడి ఇక జన్మలెత్తే అవసరం ఉండదు. మనకీ విషయాన్నే గీతాచార్యుడిగా కృష్ణపరమాత్ముడూ, ఆదిశంకరాచార్యుల రూపంలో పరమశివుడూ చెప్పారు.*
💓 *మరణానంతరం యమభటులు సూక్ష్మశరీరాన్ని మూడుశరీరాలుగా విభజిస్తారు. ఒకటి యమలోకానికి (యాతనా) వేరొకటి స్వర్గలోగానికి (భోగపు) ఇంకొకటి పితృలోకం (భోక్తము) లోనూ ఉంటుంది. తరువాత జన్మకు ముందే యమలోకం, స్వర్గలోకంలో ఉన్న శరీరాలొచ్చి పితృలోకంలో ఉన్న శరీరంతో కలసి ఎంచుకోబడిన తల్లి గర్భంలో జన్మ తీసుకుంటుంది.*
💞 *దేన్నైనా మనం నమ్మితేనే అది మనకు ‘యదార్థం’గా కనిపిస్తుంది. లేకపోతే గాలిలో పేకముక్కలతో ఇల్లు కట్టుకొన్నట్లే ఉంటుంది. కానీ నిప్పుని నిప్పు అని నమ్మక, చెప్పినా వినక అందులో వేలు పెడితే కాలక మిన్నకుండదు కదా…! ఇది మన సనాతనధర్మం మన మేలు కోరి చెప్పిన నిజం. కనుక నేనైతే నమ్మి సత్కర్మలనే చేయటానికి ప్రయత్నిస్తున్నా. అలా నన్ను ధర్మ మార్గంలోనే నడిపించమని మాత్రమే నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.* 
💖 *”సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకాస్సమస్తా స్సుఖినోభవంతు." అనేదే సనాతన ధర్మం యొక్క ప్రధానోద్దేశ్యం.*
💞 *’ఆత్మ’ శరీరంలో దాగి ఉన్నంతసేపూ శరీరంపడే కష్టాల ప్రభావం దాన్ని ప్రభావితం చేస్తూంటుంది. సుఖదుఃఖాలూ, ఆకలిదప్పికలూ లాంటివి కూడా శరీరానికి కలిగేవే అయినా దాని ఫలితం కర్మలమీద పడుతుంది. ఈ “సంచిత కర్మలు” అనేవి ఆత్మతోబాటు అది ఆక్రమించిన శరీరంతోనే ఒక కనబడని సంచీలో ఆ జీవితోబాటే అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. మనంకొత్తగా చేసే కర్మల ఫలితాలు కూడా ఆ సంచీలో పడుతూనే ఉంటాయి.*

💖 *ఒక పెద్దమనిషి చెప్పిన ఒకసారి చెప్పిన విచిత్రమైన విషయం గుర్తుకు వస్తోంది. “మనం చేసే చెడుపనులు ఇనుప సంకెళ్లులాంటివి” ఐతే “మనం మితిమీరి చేసే మంచిపనులు బంగారు సంకెళ్ల లాంటివి” అంటూనే “ఇనుప సంకెళ్లు అంతులేని కష్టాలైతే బంగారు సంకెళ్లు అపరిమిత సంపదలనూ, అంతులేని సుఖాలనూ ఇచ్చేవి. ఐతే వాటి్వలన వచ్చే చిక్కులూ, ద్వేషాలూ, ప్రాణాపాయాల సంఘటనలూ కూడా” అని చెప్పారాయన…!*
💓 *”కనుక మనసాయంకోరి వచ్చేవాడి నుండి ఏ ప్రతిఫలాన్నీ తిరిగి ఆశించకుండా సహాయం చెయ్యడమే సర్వ శ్రేష్ఠమైన పధ్ధతి అవుతుంది. కానీ మనమే ముక్కూముఖం తెలియని వాళ్లని వెతికి పట్టుకుని, పూసుకుని మరీ త్యాగభావంతో సేవ చేస్తే మనకు మనమే కోరుకుని బంగారు సంకెళ్లను తగిలించుకోవడమే ఔతుంది కదా…!” అని కూడా చెప్పాడా పెద్దమనిషి.*
💖 *నిజంగా జ్ఞానోదయమైంది నాకాయన మాటలతో. ప్రతీదానికి ఒక రీజనబుల్ లిమిట్ ఉండాల్సిందే. “పిలిచి పిల్లితల కొరిగే”చందంగా “గాలికిపోయే కంపను మనకు మనమే తగిలించుకునే” విధంగా “అపాత్రులకు” సహాయం చేస్తూవస్తున్న మనస్తత్వాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలను ఆరంభించాను.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment