Friday, November 3, 2023

శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన విధంగా మూడు అంశాలను మనం అనునిత్యం గుర్తు చేసుకోవాలి.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన విధంగా మూడు అంశాలను మనం అనునిత్యం గుర్తు చేసుకోవాలి.*
💖 *మొదటిది భౌతికమైన శరీరం. ఇది పంచ భూతాత్మకం. కర్మ పాట్లు దీనికి తప్పవు.*
💖*రెండవది శరీరం కంటే భిన్నమైంది, శరీరం పడేటంతవరకు ఆ శరీరాన్ని ఆసరా గా చేసుకుని "లోన" ఉండేది. అది ఆత్మ. అగోచరము, అవ్యక్తము, అచలము, నిప్పుతో కాలనిది, నీటి తో తడవనిది ఇత్యాది లక్షణాలతో కర్మ పాట్లకి అతీతం గా విలసిల్లేది. దీన్నే జీవుడు అని కూడా అంటుంటారు.*
💖*మూడవది ఈ రెంటికీ అతీతమైంది పరమాత్మ. వీటి యజమాని. ఎప్పుడూ నా వాడైన జీవుడు నా దగ్గరే ఉండాలి అనుకునేవాడు. లెక్కకు అందని జీవన యాత్రల నుండి జీవుడికి విముక్తి కలిగించి నిత్యం తన దగ్గరే పెట్టుకోవాలి అనుకునేవాడు. తల్లి వలె, తండ్రి వలె! కానీ శారీరక కర్మ ల ద్వారా ఎప్పటి కప్పుడు కొత్త బంధాలను, అగచాట్లను ప్రోది చేసుకుంటూ ఎప్పటికీ పరమాత్మను చేరలేక సంసారమనే బంధం లో కొనసాగుతూనే ఉంటాడు జీవుడు.*
❤️ *ఒక శరీర యాత్ర ముగిశాక కర్మ బంధాలకు లోబడిన కొత్త శరీరం వెతుకుతూ వెళ్లిపోతుంది ఆత్మ. అలా వెళ్ళడం గురించి దానికి ఎలాంటి చింత లేదు. శరీరం ముగిసి పోవడం చావు కాదని కదా పరమాత్మ అభిమతం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. శరీరం ముగియడం గురించి చింత పడే అర్జునుడి కి ఉపదేశమే గీత.*

💓 *జీవుడు పరమాత్మ కు సమకాలీనుడు. ఆత్మ పరమాత్మ లకు ఒకటే తేడా … తాను అంతకు ముందు "ఉన్నట్లు" పరమాత్మకు సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. అది లేని వాడు జీవుడు. వాడు బద్దుడు. కర్మకు లోబడిన వాడు.*
💕*అస్థిత్వంకోల్పోయిన శరీరంలో ఆత్మ పరమాత్మలకు తావు లేదు. అంటే శరీరం నుండి ఆత్మ తప్పని సరిగా విడుదల అవుతుంది. (Soul exits the body).*
💞 *ఆత్మ శరీరం నుండి విడుదల అవ్వడానికి మూడు మార్గాలను నిర్దేశించారు పెద్దలు ఆయా గుణాలను బట్టి. సత్వం అధికమై ఉంటే ఊర్థ్వమైన శిరస్సు నుండి, రజస్సు అధికమైతే ముఖ భాగాలనుండి (కళ్ళు ఇత్యాది), తమో గుణం ప్రస్ఫుటంగా ఉంటే నీచ స్థానమైన గుద భాగం నుండి ఆత్మ నిష్క్రమణ జరుగుతుంది. కొన్ని శరీరాలు ప్రశాంతంగా ఉన్నట్లు, కొన్ని అలజడిగా ఉన్నట్లు మనం చూస్తాం.*
💖*సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తే ఆత్మ శరీరం నుండి బయటకు రావడమూ, ఆ తరువాత ఆత్మ ప్రయాణమూ కూడా సత్యమని అర్థమవుతుంది మనకు.*

💖 *శరీరపు ఉనికి ఉన్నప్పుడే (బ్రతికి ఉన్నప్పుడే) వివిధ ప్రక్రియల ద్వారా ఆత్మ బయటకు రాగలగడం, లోనికి వెళ్ళగలగడం వంటివి సాధ్యం కాదనిపిస్తుంది.*
💓*ఆత్మ, పరమాత్మ, ప్రకృతి (శరీరం) ల కలయికే జీవుడి ప్రయాణం. ఆత్మ (జీవుడు), ప్రకృతులకు ఆలంబనగా నిలిచే వాడు పరమాత్మ. పరమాత్మ కలిసి ఉంటేనే మిగతా రెంటికీ అస్థిత్వం. మరి అత్యంత సూక్ష్మమైన ఆత్మ, పరమాత్మతో కలిసి శరీరంలో ఉండడం వల్లనే మనమీ శరీరంలో చైతన్యాన్ని గమనిస్తున్నాం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment