Tuesday, November 7, 2023

ఎవరైనా శ్రమ కలిగిస్తూన్నప్పుడు దానిని సహించడానికి 'క్షమ' అని అంటారు.

 280223a1635.   010323/1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀785. 
నేటి…

           *ఆచార్య సద్బోధన:*
               ➖➖➖✍️

*ఎవరైనా శ్రమ కలిగిస్తూన్నప్పుడు దానిని సహించడానికి 'క్షమ' అని అంటారు.* 

*క్షమలో రెండు రకాలున్నాయి. ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతీకారం చూపడానికి శక్తి లేనందువలన కొంతమంది సహించి ఉంటారు. అది మొదటి రకం.* 

*ప్రతీకారం చూపడానికి తగిన శక్తి ఉండి కూడా అలా చేయకుండా సహించి ఉండటం రెండవ విధమైనది.. ఇదియే నిజమైన క్షమ.* 

*ఎవరైనా మనకు అపకారం చేస్తే తిరిగి అతనికి అపకారము చేయడానికి ప్రయత్నము చేయగూడదు.*

*అలాచేస్తే అతనికి దుఃఖం కలిగించిన పాపం మనకు వస్తుంది. అతడు మనకు కావాలని అపకారం చేశాడా, తెలియక చేశాడా అనేది ముందు తెలుసుకోవాలి. కావాలని చేయకపోతే ఆ విషయాన్ని అక్కడికి వదలి వేయాలి.* 

*కావాలని చేస్తే తగిన సలహా ఇచ్చి అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి.*

*మనం ప్రతీకారం చేయకపోతే దానివల్ల అతడు పశ్చాత్తాపం చెంది తనకుతాను సరిదిద్దుకొనడానికి అవకాశం ఉంది.*

*కోపాన్ని జయించని వానిలో క్షమాగుణం ఉండదు.*

*కోరికతోను, దురాశతోను కలిపి కోపాన్ని అంతర శత్రుకోటిలో పరిగణించారు. అందుచేత కోపాన్ని, జయించాలి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment