పున్నామ నరక త్రాయతే ఇతి పుత్రః
పున్నామ నరకం నుండి తప్పించు వాడే పుత్రుడు.
తండ్రి బీజమే భార్యగర్భం లో పుత్రుడిగా జన్మ పొందితుంది. అంటే తండ్రి ఆత్మ తేజస్సే, తండ్రి ప్రతి రూపమే పుత్రుడు. తండ్రి ఆస్తికి, గుణాలకు, కీర్తికి..... వారసుడు పుత్రుడే.
అందుకే శ్రద్ధ కర్మలు చెయ్యడానికి పుత్రుడే అర్హుడు.
కూతురు కాదు.
ఒకవేళ కొడుకులు లేకపోతే.... శాస్త్రం చెప్పిన ప్రత్యామ్నాయ్యం...
శాస్త్రం ప్రకారం దత్తత తీసుకున్న కొడుకు చేయవచ్చు , అదీ లేకపోతే చివరి అవకాశంగా కూతురు కొడుకు, లేదా కొడుకు యొక్క కొడుకు.... పిండ ప్రధానం చేయవచ్చు.
లేదా అన్నదమ్ముల కొడుకులు శాస్త్రం ప్రకారం ప్రత్యేక విధానం లో చేయవచ్చు.
పరిశుద్ధ హృదయంతో.... మానవతా ధర్మంతో అనాధ శవాలకు ఎవ్వరైనా పిండ ప్రధానం చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది.
ఇంకా వివరంగా కావాలంటే.... ఎవరైనా శాస్త్రం చదువుకున్న బ్రాహ్మణులను అడిగి తెలుసుకోగలరు.
No comments:
Post a Comment