Wednesday, November 8, 2023

వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?

 2201.   2-9.3️⃣.  090323-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  *బ్రహ్మ ముడి*
                   ➖➖➖✍️

*వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?*

*మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో  ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి కి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.*

*పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మ ముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు.*

*వధూవరులు ఇద్దరినీ రెండు దేహాలూ, ఒకటే ఆత్మ, ఒకటే ప్రాణంగా చేసే ప్రక్రియే, బ్రహ్మ ముడి!* 

*కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపుకాయ, చిల్లరనాణెం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు.*

*కంద ఒకచోట పాతితే దిన దినమూ వృద్ధి చెందుతూ, ఎకరం ఎకరముల వరకూ వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశవృద్ధిని చెయ్యాలని కందను కడతారు.*

*క్షయం లేనిది ఖర్జూరపుకాయ. దంపతుల బంధమూ, వంశమూ, క్షయం లేకుండా ఉండాలని ఖర్జూరపుకాయను కడతారు.*

*అందాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతనూ, పెంపొందించే ఔషధం పసుపు. ఆయురారోగ్యములతో, పవిత్రంగా ఉండాలని పసుపుకొమ్ములను కడతారు.*

*ఇకపోతే, ఆకు-వక్క అనేది విడివిడిగా ఉన్నా, కలిస్తే ఎర్రగా పండుతాయి. దంపతులు ఇరువురూ ఒకటే ప్రాణం గా ఉంటూ, వారి కాపురాన్ని నూరేళ్ళ పంటగా పండించుకోవాలని ఆకు, వక్క కడతారు.*

*మనకు తెలిసినదే, చిల్లర నాణెం లక్ష్మీస్వరూపం. అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని చిల్లర నాణెం కడతారు.*

*ఇన్ని పరమార్ధాలు ఉన్న… కంద పిలక, పసుపుకొమ్ము, ఖర్జూరపుకాయ, ఆకు, వక్క, చిల్లరనాణెం కలిపి పురోహితుడి రూపంలో ఉన్న సాక్షాత్ బ్రహ్మ దేవుడే వేదమంత్రాల నడుమ పెద్దల ఆశీర్వచనములతో ముడి వేస్తే,              ఆ కాపురానికి తిరుగులేదని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment