Friday, November 3, 2023

ఓ బాటసారీ ! ఈ మాటల్ని మరువకోయీ !!! 🙏

 శుభోదయం 💐🙏

బరాక్ ఒబామా 44 ఏళ్లకే అమెరికా అధ్యక్షుడయ్యాడు . 
55 ఏళ్లకు రిటైర్ అయ్యాడు .
డోనాల్డ్ ట్రంప్ 70 ఏళ్లకు అమెరికా అధ్యక్షుడయ్యాడు .

జగపతి బాబు వయస్సు 61 . గత ఐదారేళ్ళనుంచి హీరో పాత్రలకు స్వస్తి చెప్పి విలన్ పాత్రలను పోషిస్తున్నాడు .

హీరోగా చిరంజీవికే పోటీనిచ్చిన రాజశేఖర్ 61  ఏళ్లకు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు .
 
సినిమా ఫీల్డ్ లో ఉండే కులవివక్షతను ఛేదించి రచ్చ గెలిచి ఇంట గెలిచిన హీరో సుధాకర్. ఇప్పుడు  వయస్సు 64 . అనేక ఏళ్లుగా తీవ్ర  అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు .

మహేష్ బాబు వయస్సు 48 . ఇరవై అయిదేళ్ల హీరో లాగా కనిపిస్తున్నాడు .

బాలకృష్ణ వయస్సు 63 . 
తన నట జీవితం లో ఎప్పుడూ లేనంత పీక్ లో ఉన్నాడు.
హాట్రిక్ విజయాల్ని సాధించాడు . 

చిరంజీవి  వయస్సు 68 . 
కసితో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు .

రజనీకాంత్ వయస్సు 74 . 
ఈ వయస్సులో చాలా మంది అన్ని వ్యాపకాలను మానుకొని ఇంటిపట్టున ఉండిపోతారు . ఈయన 600  కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానుల గుండెల్లో మరో సారి జైలర్ అయ్యాడు .

తాత సూపర్ స్టార్. తండ్రి సూపర్ స్టార్. తనకు 29  ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్ . 

రవి తేజ 1992 సంవత్సరంలోనే నటించడం మొదలుపెట్టాడు. పదేళ్ల తరువాత,  35  ఏళ్ళ వయస్సు లో మొదటి హిట్ కొట్టాడు .  

జీవితం ఒక సుదూర పరుగుపందెం . 
అంటే మారథాన్ రేస్ .

పదవ తరగతి , ఇంటర్ , ఎంసెట్ , క్లాట్, నీట్ , ఐఐటీ జేఈఈ,  సివిల్స్,  గ్రూప్ 1 , 2 , పెళ్లి , వ్యాపారం , జాబ్ .. ఇలాంటివన్నీ  వంద మీటర్ ల పరుగుపందేలు .
 గెలిస్తే బాగుంటుంది .
 గెలవడం కోసం ఇష్టపడి కష్టపడాలి . 
కానీ .. వాటిలో గెలిస్తేనే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు.

ఐఏఎస్,  ఐపీఎస్ లాంటి ఉన్నత సర్వీస్ లు సాధించి అరవై ఏళ్ళ వయసులో ట్రోలింగ్ కు గురవుతున్నవారిని చూస్తున్నాము. 

పాట ఆగకూడదు .....  
ఆట ఆగకూడదు.

బహుదూరపు బాటసారీ ....
పరుగెత్తాలి ప్రతీ రోజూ....
ప్రతీ గంటా.....
మారథాన్ రేస్ లో గెలుపొందాలి అంటే వంద మీటర్ల పరుగుపందెంలో పరుగెత్తినట్టు ఊపిరి బిగబట్టి పరుగెత్తడం  కాదు. అలా పరుగెడితే అలసిపోతావు  . 
నింపాదిగా ప్రతీ నిముషాన్ని...  ప్రతీ గంటని...  ఎంజాయ్ చేస్తూ పరుగెత్తాలి .

 రేస్ లో ఉన్నామని గుర్తుంచుకోవాలి .
 చాలా మంది ఒక సక్సస్ సాధించిన వెంటనే  " ఇంకేంటి లైఫ్ లో గెలుపొందాము "  అనుకొని పరుగును ఆపేస్తారు .
 
ఆత్మ హత్య చేసుకొన్న ఐఏఎస్ లను చూసాము. 
ఐఐటీ విద్యార్థుల ఆత్మ హత్యలు చూస్తున్నాము .
 
జీవితం అనే సినిమాలో  ఒక స్ప్రింట్ రేస్ అంటే వంద మీటర్ల పరుగుపందెం లాంటి ఐఏఎస్, ఐఐటీ లాంటివి సాధించడం తోటే శుభం కార్డు పడదు .

ఊహ తెలిసినప్పటినుంచి తుది శ్వాస దాకా మారథాన్ ను సాగించాలి.
" రిటైర్ అయ్యాను!  నాకేంటి ?పెన్షన్ వస్తుంది " అని ఇంటిపట్టునే కూర్చుంటే మానసికారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది.

చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ జీవనం సాగించాలి .

ఒక పరీక్షలో లేదా వరుసగా పది పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు  కాదు. 
బాలకృష్ణ కు ఒక దశలో ఎన్నో ప్లాప్ లు వచ్చాయి.

ఎవరూ విజేతలు కారు ....
పరాజితులూ కారు.

 ఎన్నో సాధించి అరవై - డెబ్భై ఏళ్ళ వయసులో అనారోగ్యం లేదా పిల్లల ప్రవర్తన వల్ల బాధల్ని,  అవమానాల్ని భరించేవారు ఎంత మందో !!ఎన్నో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొన్నా,  తట్టుకొని నిలబడి జీవితం లో విజయాన్ని చవిచూసి  ఆనందించేవారు ఎందరో !!!

చదువు ... కెరీర్ ... కుటుంబం .. భార్య / భర్త , పిల్లలు , తల్లితండ్రులు , ఆరోగ్యం....
ఇవన్నీ మైలు రాళ్లు. 
ఒకటి రెండింటి లో ఎంత విజయం సాధించినా, 
 మరొక దానిలో ఫెయిల్ అయితే జీవితం నరకం .

జీవితం ఒక విస్తరి. 
రుచి బాగుంటుందని  కేవలం లడ్డూనే విస్తర్లో పెట్టుకొని తింటామా ?

అన్నింటిలో... అన్ని దశల్లో..  పోరాటం ద్వారా,  ప్లానింగ్ ద్వారా విజయం సాధించాలి . కష్టాల్ని  గ్లూకోస్ లాగా తీసుకొంటూ  ...  అవమానాల్ని షూస్ లాగా  వేసుకొని పరుగు   సాగించాలి .
 అపజయానికి మించిన గురువు లేడని గ్రహించాలి.

నిన్నటి కంటే నేడు బాగుండాలి. నేటి కంటే రేపు,
రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి. 

ఇరవై  ఏళ్ళ వయసులో విశ్వసుందరి లాంటి పోటీల్లో గెలుపొంది,  ఉన్నత శిఖరాల్ని చేరుకొని కూడా అటుపై జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోలేక కుంగుబాటుకు గురయ్యే వారెందరో !!!

మీ జీవితానికి మీరే  హీరో / హీరోయిన్. 
వేరొకరితో పోలికెందుకు ???

ఇహలోక కుబేరుడు అంబానీ కూడా నేడు బ్లాక్ మెయిలర్స్ థ్రెట్ ను ఎదుర్కొంటున్నాడు .
మంత్రులు, VIP లు తుపాకి నీడలో బతుకుతున్నారు.

హీరోలు, హీరోయిన్ లు సెలబ్రిటీ లు ..... మీలా రైల్వే స్టేషన్ కు, బస్టాండ్ కు, పార్క్ కు, టూర్ కు వెళ్ళగలరా ???
వారు పంజరం లో పక్షులు.

అదృష్టం మీదా?  వారిదా ?

మన ఆలోచనే మన జీవితం.
ఎందుకు పుట్టామో,
ఎందుకు మరణిస్తామో తెలియదు. 
అది మీ చేతిలో లేదు. 
కానీ..... జనన మరణాల మధ్య వున్న  సుదూర పయనం   మీ చేతిలో. 

 ప్రతీ  రోజూ..... 
భలే మంచి రోజు... 
పసందైన రోజు ...
వసంతాలు పూచే రోజు కావాలి .
 అది మీ చేతిలోనే ఉంది.
 
ఈ  లోకం  మీ ముందు నిలిచిన అద్దం.

ఓ బాటసారీ ! 
ఈ మాటల్ని మరువకోయీ !!! 🙏

No comments:

Post a Comment