Tuesday, November 7, 2023

పుత్రీకరణం

 260122A1347.   280122-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                  *పుత్రీకరణం*
                  ➖➖➖✍️


           *విదురుడూ , భీష్ముడూ సంప్రతించుకుని కృష్ణ వంశానికి             చెందిన ‘శూరుడు’ అనేవాని  పెద్ద కూతురు ‘పృధ’ను పాండురాజుకు  భార్యగాఎంపిక చేశారు.*

*’పృధ’ అన్న వసుదేవుడు. ఆమెను తండ్రి - తన మేనత్త కొడుకైన ‘కుంతి భోజు’నికి పెంపకానికి ఇచ్చాడట.* 

*"ఆడపిల్లను పెంచుకునే పద్ధతి ఉన్న సమాజం నాటి కథ ఇది.* 

*సాధారణంగా వంశం నిలపటానికి మగపిల్లల్నే దత్తత చేసుకుంటారు. అది ఆధునిక సంప్రదాయం. రామాయణ కథలో ‘శాంత’ కూడా ఇలా దత్తత వెళ్ళిందంటారు. (జానపద కథల్లో శాంత పాటలున్నాయి.)*

*పూర్వం పుత్రులు లేనివారు తమ కూతుళ్ళను "పుత్రీకరణం” చేసుకునేవారు.* 

*అంటే వారికి పుట్టిన పిల్లవాడు తమ కులానికి వారసుడవుతాడన్న మాట. కూతురి కొడుకుకు అల్లుని ఇంటిపేరు కాకుండా తన ఇంటిపేరు వస్తుంది. ఈ విషయం ముందే ఒప్పందం చేసుకుంటారు.* 

*పుత్రిక-పుత్రుడు ఇద్దరూ సమానమే అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.* 

*దక్ష ప్రజాపతి తన కూతుళ్ళను పుత్రీకరణం చేసుకున్నాడు. (ఆది. 3-61). అది ప్రాచీన ధర్మం.* 

*అర్జునునికీ చిత్రాంగదకూ పుట్టిన కుమారుడు బబ్రువాహనుడు ఆమె తండ్రికి వారసుడయ్యాడు. ఇది కొన్ని దేశాల/రాజ్యాలలోని ఆచారం."*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment