సత్సంగం
భగవద్గీత ని అర్థం తెలియకుండా చదివినా సరే
గీతా పారాయణం అనేది చక్కటి సుకర్మ
భోజనానికి ముందు గీతలోని 15వ అధ్యాయంలోని 20 శ్లోకాలను చదవటం చాలా ఆశ్రమాల్లో ఆచారంగా వస్తోంది
ఆహారం స్వీకరించే ముందు కూడా *బ్రహ్మార్పణం బ్రహ్మహవిః* శ్లోకాన్ని స్మరించడం కూడా ఆచారంగా ఉంది
భగవద్గీత మనకి ఆధ్యాత్మిక భోజనాన్ని అందిస్తుంది
దానిని నిత్యం చదివితేనే ఆ భోజనం మనకి దొరుకుతుంది
వేయించిన వేరుశనగపప్పుని ఏ పార్కులోనో, రైల్లోనే వెళ్తూ
ఎప్పుడో తిన్నట్టుగా భగవద్గీతను అప్పుడప్పుడు అక్కడక్కడ మాత్రమే చదివేవారికి
ఆధ్యాత్మిక పుష్టి ఉండదు
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేసిన ఏ ఒక్క బోధా శ్లోకాన్ని పాటించినా మానవ జన్మ లక్ష్యాన్ని సఫలం చేసుకున్నట్టే
దానిమ్మ గింజ రుచి ఎంతో మధురంగా ఉంటుంది
కానీ ప్రతీ గింజలో రసం ఉన్నా దాంట్లోని పలుకు పంటికి తగిలినప్పుడల్లా
అసహనంగా ఉంటుంది
అంతేకాదు
ఒంటి మీదకి రసం కూడా చిందుతుంది
భగవద్గీత కూడా అలాంటిదే
మనం శ్లోకాన్నీ ,దాని భావాన్నీ చదివితే అది అర్థం కాదు.
దానిమ్మ గింజల్ని ఎవరైనా రసం తీసి ఇస్తే తాగటానికి ఎంత బాగుంటుందో
పెద్దలు చెప్పిన భాష్యాన్ని చదివితేనే
అప్పుడు అది అర్థమై దాంట్లో దాక్కుని ఉన్న మధురిమని ఆస్వాదించగలం
భగవద్గీత మీద ఎన్నో భాష్యాలు ఉన్నాయి
బాలగంగాధర్ తిలక్ వారి భాష్యం, విద్యాప్రకాశానందగిరి వారి గీతా మకరందం, శ్రీ మలయాళ స్వామి వారు రచించిన భాష్యం , ,
గీతా ప్రెస్ వారి గోయంకా భాష్యం, ఇస్కాన్ టెంపుల్ వారు ప్రచురించిన శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం,
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు రచించిన భాష్యం (మూడు వాల్యూమ్స్ గా లభ్యం అవుతోంది)
శిష్ట్లా సుబ్బారావు గారి భాష్యం,
శంకరభాష్యం ,రామకృష్ణ పరమహంస శిష్యులు కొందరు రాసిన భాష్యాలు ఇలా
చాలా చాలా ఉన్నాయి
కాబట్టీ వాటిలో ఏదో ఒకదాన్ని తీసుకుని నిత్యం చదవటం లేదా వినడం చాలా మంచిది
భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మంచి మార్గం ఏమిటంటే....చదివి అర్థం చేసుకుని అందులో చెప్పినట్టుగా జీవించటమే
No comments:
Post a Comment