Wednesday, November 8, 2023

మనదేశ సంస్కృతి

 0811.  1-9. 040323-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

            *మనదేశ సంస్కృతి*
                 ➖➖➖✍️

*ఈ ఫొటో లోని  డాక్టరు   25 ఏళ్ల క్రిందటే ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు.*

*ఒకరోజు తన కూతురు స్కూలు నుండి చిరాగ్గా వచ్చింది..*

*"ఏమయింది?" అని అడిగేతే..*

*"స్కూలులో పిల్లలు ‘మీ అమ్మ ఏంటి విచిత్రంగా డ్రెస్ (చీర) వేసుకుంటుంది, అస్సలు అర్థం లేకుండా’ అని ఏడిపిస్తున్నారు“ అని చెప్పింది.*

*పాతిక ఏళ్ళ క్రిందట వాళ్ళు ఉండే ఏరియాలో ఇండియన్స్ తక్కువ..*


*ఆ డాక్టరు స్కూలుకి వెళ్ళి టీచర్ కి విషయం చెప్పింది.*

*టీచర్ చాల బాధపడింది..*

*“ఏవిధమైన డ్రెస్ discrimination స్కూల్లో allowచెయ్యం, ఆఅమ్మాయిని పిలిచి పనిషమెంట్ ఇస్తా" అన్నారు.*

*ఆ డాక్టరు గారు.."అలా వొద్దు అలా చేస్తే పిల్లల మద్య వైరం, దూరం పెరుగుతాయి, ఒక్క అవకాశం ఇవ్వండి, మా ఇండియన్ కల్చర్ గురించి పిల్లలకు చెప్తాను" అన్నారు.*

*టీచర్ ఒప్పుకొని ఏర్పాటు చేసారు.*

*ఈ డాక్టరు గారు మన చీరలు, నగలు, బొట్టు, దేవుడి బొమ్మలు, రామాయణ భారతాలు అన్ని తీసుకెళ్లి 'ఇండియా గురించి 'కట్టు బొట్టు'మన ఆచారాలు, ఆవిడ డాన్సర్ కూడా అవటం వల్ల రామాయణం లో కొన్ని ఘట్టాలు చేసి చుపించారు.*

*అదే కాకుండగా "మీ అమ్మ పిచ్చి డ్రెస్ వేస్తుంది" అన్న ఆ అమ్మయికి చక్కటి చీర కట్టి, బొట్టు పెట్టి "నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావ్?"   అని అడగగా… "నేను చీర కట్టుకోగానే ఒక రాజకుమారిలా ఫీల్ అవుతున్నా" అన్నది.*

*ఆ రోజు నుండి ఆ స్కూలు పిల్లలు అందరూ చీరని admire చెయ్యటం మొదలు పెట్టారట.*

*ఈ రోజు వరకు 1500 ప్రదర్శనలు ఇండియన్ కట్టు,బొట్టు గురించి ఆ డాక్టరు గారు ఇచ్చారు.*

*ఒక విమర్శను తనకు తన దేశానికి అనుకూలంగా ఎంత బాగ మార్చుకున్నారు కదా!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment