Monday, November 6, 2023

ఓర్పుకి ప్రతీక సాలెపురుగు.....

 విషయం పాతదే అవ్వనీ, అడుగడుగునా హెచ్చరించే ఉదాహరణ. 
Yandamoori Veerendranath గారి రచనలో...
ఎవరేమోగానీ, నన్ను నేను మాత్రం ఎన్నోసార్లు చూసుకున్నాను. 

"ఓర్పుకి ప్రతీక సాలెపురుగు. గదిలో ఒకమూల నిశ్శబ్దంగా ఓర్పుగా అది గూడు కట్టుకుంటుంది. ఎవర్నీ సాయమడగకుండా తననుంచి తాను విడువడుతూ...తనని తాను త్యాగం చేసుకుంటూ పోగు తరవాత పోగు గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు, ఒక డాక్టరు నరాలతో గొప్ప నైపుణ్యంతో ముళ్ళు వేసినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.
ఒక హడావిడి ఉదయాన్నో, నిశ్శబ్ద సాయంత్రసమయానో గోడమీంచి పెద్దశబ్ధంతో వచ్చిన చీపిరికట్ట ఒక్కవేటుతో దాని శ్రమనంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. 
సర్వనాశనమైపోయిన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాధలా నేలమీద పడుతుంది. ఎవర్నీ కుట్టదు. ఎవరి మీదా కోపం ప్రదర్శించదు. 
మళ్ళీ తన మనుగడకోసం కొత్త వంతెన నిర్మించుకోవటానికి సహనం పోగుల్ని నమ్మకం గోడమీద తిరిగి స్రవిస్తుంది.
ఎలా బతకాలో మనిషికి పాఠం చెబుతుంది."

- విజయానికి అయిదు మెట్లు

No comments:

Post a Comment