Tuesday, November 7, 2023

కతికితే అతకదు!

 150223f1416.      160223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *కతికితే అతకదు!*
                ➖➖➖✍️

*మనలో ఎవరైనా పెండ్లిసంబంధాల నిమిత్త౦ అమ్మాయిని చూసుకోడానికి వెళ్ళినప్పుడు వారు భోజనం చెయ్యమని ఎంత బ్రతిమాలినా చెయ్యరు. కతికితే అతకదని చెప్పి తప్పి౦చుకుంటారు.* 

*దీనికి కారణ౦ ఏమిటా  అని ఆలోచిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది . అదేమిటంటే….  మనం వారు పెట్టిన భోజనం చేస్తే మనకు వారి పట్ల ఒక soft  corner ఏర్పడుతుంది.*

* అది ఒక్కొక్కప్పుడు వ్యవహారానికి ఆటంకం కలుగజేయవచ్చు.*

*ఉదాహరణకి మనం బట్టలుగాని మరేవైనా వస్తువులు గాని కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ షాపు  యజమాని మనకు tea గాని కూల్ డ్రింక్స్ గాని ఇస్తారు. మనం తీసుకో కూడదు.*

*ఒకవేళ మనం అవి తీసుకుంటే….           ఆ వ్యక్తితో మనకు ఒక బంధం ఏర్పడుతుంది. బట్టలు లేదా ఏదైనా వస్తువు మనకు నచ్చినా నచ్చక పోయినా తప్పనిసరిగా కొనవలసిన అగత్యం ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్లు మనకందించిన cool drinks సీసాలు అప్పటికే డజనో అరడజనో త్రాగేసు౦టాం కాబట్టి.*

*అందుకని ఏదో ఒకటి కొనకుండా రాలేం.*

*ఇక వస్తువో బట్టలో ఐతే అవి  ఎలాఉన్నా కొనుక్కోవచ్చు. కొంతకాలం వాడుకుని బయట పడెయ్యొచ్చు. కాని వధువు అటువంటిది కాదు, కాకూడదు. ఆమె జీవితాంతం మన వెంట ఉండేది ఉండవలసినదిన్నీ. అందువల్ల అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో ఎటువంటి మొహమాటాలకు తావుండకూడదు. మనం ఒకవేళ వాళ్ళు పెట్టినవన్నీ కాదనలేక ఆరగించి మన ఇంటికెళ్ళాక    అమ్మాయి నచ్చలేదని చెబితే ‘పిండి వంటలు దొబ్బితిని పిల్లనచ్చలేదన్నారు వెధవలు’ అని తిట్టుకోవచ్చు.* 

*అటువంటి అవకాశం మనం వాళ్ళకు ఇవ్వకూడదు.   ఇక కొంచెం  మొహమాటపడి పిల్ల నచ్చక పోయినా ఏదోవిధంగా నచ్చిందని చేసుకుంటే జీవితం దుర్భరం.* 

*కాబట్టి వివాహవిషయంలో ఇటువంటి మొహమాటాలను సమూలంగా త్రుంచి వేయడానికే ‘కతికితే అతకదు’ అనే నియమాన్ని మన ప్రాచీనులు ఏర్పరిచారు.*

*ఆహా ! ఎంత గొప్ప వారు మన పూర్వులు. అందువల్ల  మనమెప్పుడైనా ఏదైనా కొనడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు మనకిచ్చే తినుబండారాలు తీసుకోకూడదు. వస్తువు కొన్నాక తీసుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది లేదు.  మొత్తం మీద చెప్పేదేమిటంటే….                “ఆహారవ్యవహారేషు త్యక్తలజ్జః సుఖీ భవేత్!”* ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment