🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --3*🌷
🍁 *ప్రశ్న :--- మాకు ఆధ్యాత్మికత అన్నది ఎంత అద్భుతంగా ఉందంటే, మా సమయం అంతా ఇందులోనే గడపాలి అన్పిస్తోంది. పుస్తకాలు చదువుకోవటానికీ, ధ్యానం చేసుకోవటానికీ, ఇంకా మా కుటుంబం, బంధు మిత్రులు, ఇరుగు పొరుగు వాళ్ళకు ధ్యానాన్ని నేర్పించటానికి ఒక రోజులో 24 గంటలూ సరిపోవటమే లేదు. ఆధ్యాత్మికతలో ఉండి కూడా నా కుటుంబ అవసరాలకూ, ఆధ్యాత్మిక అవసరాలకు మధ్య సరియైన సంతులనాన్ని తీసుకురాలేకపోతున్నాను. దయచేసి సమతుల్యత సాధించటం ఎలానో చెప్పరూ?*
🌷 *పత్రీజీ :---* మీ సమయంలో సగభాగం మీ భౌతిక జీవిత ధర్మాన్ని నిర్వర్తించటానికి, మిగతా సగభాగం అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మాన్ని అవలంబించటానికి విభజించుకోవాలి. భౌతిక జీవితంలోని బాధ్యతలు అన్నింటినీ చక్కగా నిర్వహిస్తూనే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కూడా సాధన చెయ్యాలి. ఈ రెండింటి మధ్య ఖచ్చితమైన సమతుల్యత సాధించాలి.
🌲 ఏ విషయంలో కూడా ఎలాంటి ఆరాటం, ఆతృత పనికి రాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అయినా సరే. అయితే భౌతికత్వంలో మునిగిపోకుండా ఎరుకతో ఉండాలి. మీ దేహ పరమైన కర్తవ్యాలను తప్పకుండా చెయ్యాలి, అయితే వాటి ఆకర్షణలో పడిపోకూడదు.
ఆధ్యాత్మిక సాధన కోసం ప్రతి రోజూ 12 గంటలు కేటాయించుకోవాలి. మిగతా 12 గంటల సమయం అంతా భౌతిక జీవితానికి కేటాయిస్తే ఆ రోజంతా చక్కని సమతుల్యతలో ఉంటుంది. 50 శాతం ప్రాపంచిక జీవితం, 50 శాతం ఆధ్యాత్మిక జీవితం, సమతుల్యతతో జీవించటమే PSSM అంటే ! అదీ సంగతి.
🍁 *ప్రశ్న :--- ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం వలన శక్తిని పొందుతామా?*
🏵️ *పత్రీజీ :---* ఆధ్యాత్మికతలో ఉన్న మనకు ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఒక లీల. ఒక కేళి. ఆధ్యాత్మిక కార్యం అంటే విశ్రాంతిగా ఉండటం... ఆధ్యాత్మిక కార్యం అంటే మానసిక ప్రశాంతత... ఆధ్యాత్మిక కార్యం అంటే ఉప్పొంగే శక్తి... కనుక ఆధ్యాత్మిక కార్యాలు ఏవి చేస్తున్నా ఎంతగానో పునరుత్తేజితం అవుతూ ఉంటాం.
No comments:
Post a Comment