కొడుకుని పెంచడం కంటే కొబ్బరి చెట్టుని పెంచడం ఉత్తమమని సామెత ఎందుకు పుట్టిందో నాకు తెలియదు కానీ..
ఈ చిన్న కథ చూడండి..
ఒక రైతు తన కొడుకు పుట్టిన వెంటనే,
ఒక కొబ్బరి చెట్టుని కూడా నాటాడు..
ఆ కొబ్బరి చెట్టు
ఎదుగుతూ ఆ రైతుకు నీడనిచ్చింది..
అతనికి దాహం వేసినప్పుడల్లా నీళ్ళని ఇచ్చింది.
తను గుడిసె కట్టుకునేటప్పుడు తన ఆకుల్ని ఇచ్చింది.
ఆఖరికి ఆ రైతు చచ్చిపోతే అతని కాల్చడానికి కట్టేలనిచ్చింది.
కానీ కడుపున పుట్టిన కొడుకు ఇవి ఏమీ ఇవ్వకపోగా,
ఆ చెట్టు నా వాటా లోనిది కాబట్టి ఆ కట్టెలు నాన్న శవాన్ని కాల్చడానికి నేను ఇవ్వను,
అని పంతం పట్టుకుని కూర్చున్నాడు.
ఆ కట్టెలకి ఖరీదు కట్టాడు.
ఇప్పుడు చెప్పండి..
కొడుకు గొప్పవాడా...?
కొబ్బరి చెట్టు గొప్పదా...?
కాబట్టి ఈ తరం తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను..
మీ మట్టి ఖర్చు మీరు దాచుకొని చావండి...
లేకపోతే మీ శవం మున్సిపాలిటీ గతి అవుతుంది..
ప్రేమ, ఆప్యాయత, బంధం అనుబంధం అనే పదాలకి అర్థం కూడా తెలవని నా కొడుకులు
ఈ తరం కొడుకులు..
అలాంటి వాళ్ళకోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి ప్లీజ్..
స్వార్థం నిలువెల్లా నిండిన రూపం ఈ తరం నా కొడుకులది..
అలాంటి నా కొడుకులు కొరివి పెట్టడానికి కూడా పనికిరారని గుర్తుంచుకోండి....
అందరూ కొడుకులు అలాంటి వాళ్ళే అని నేను అనను కానీ ఏ నా కొడుకైనా కొడుకే అని మాత్రం గుర్తు పెట్టుకోమని చెబుతున్నాను అంతే....
🙏🙏*శుభోదయం*🙏🙏
No comments:
Post a Comment