Sunday, December 31, 2023

మానవత్వమే ...*

 ❁┈┈┈┈┈   ॐ    ┈┈┈┈┈❁
      ☀️ ఆదివారం ఆణిముత్యాలు            
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
               *మానవత్వమే ...* 

నిన్న పొతే ఈరోజు 
ఈరోజు పొతే రేపటికి 
రెండో రోజు 

జీవుడు తనతో వెంట 
తెచ్చుకున్నవి 
తనతో వెంట 
తీసుకెళ్లేవీ
కంటికి కనిపించని 
కర్మఫలితాలు,
జనన మరణాల చక్రాన్ని 
నడిపించే పాపపుణ్యాలు మాత్రమే 

కానీ 
వదిలి వెళ్ళేవి మాత్రం 
చాలా ఉంటాయి 
బంధాలు 
అనుబంధాలు 
జ్ఞాపకాలు 
కన్నీళ్లు 
ఆనందబాష్పాలు 

మనిషిగా 
జన్మ ఎత్తినప్పుడు 
మనం ఏమి లోకంలో 
మిగిల్చి వెళతామో 
అవే మనకు జన్మ జన్మలకు 
తోడుగా వస్తాయి 
నీడలా నిలుస్తాయి 

మన చుట్టూ ఉన్న 
ఒక బాధాతప్త హృదయాలకి 
ఇవ్వగలిగే గొప్ప కానుక 
ఒక చిరునవ్వు 
ఒక ఓదార్పు 
ఒక బాసట 
ఒక ఊరట 
ఒక స్పర్శ 
నీవు ఒంటరివి కాదు 
నేను ఉన్నాను అనే భావన 

ఈశ్వరుడు కూడా మెచ్చేది 
అలాంటి మానవత్వాన్నే
తనకి పూజలు సేవలు చేయకున్నా
తన భక్తులకు 
చేసే సాయాలకు ఎంతో మురిసిపోతాడు
తన బిడ్డకు బహుమతి ఇస్తే 
పొంగిపోయే తండ్రి లాగా 

మానవత్వమే మొదటి మెట్టు 
దైవత్వానికి .
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
                ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
  పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
       భారతీయత కూడా నేర్పండి

   🙋🏻‍♂️ జై హింద్  🇮🇳  జై భారత్  🫡

No comments:

Post a Comment