. *అమ్మ*
. ********
సృష్టి లోన చక్కనిదీ
అమ్మయనే సంబోధన.
మానసిక వికాసమునకు
మూలమమ్మ బోధన.
ఆది గురువుగా ఇంటిలొ
అమ్మదె తొలి బోధన.
అందుకె అమ్మను ప్రేమగ
చూసి చేయు ఆరాధన.
గురు దక్షిణ ఏనాడూ
ఆశించని గురువు అమ్మ.
దేవుని కన్నను మిన్నగ
చూసుకొనును మనను అమ్మ.
కనిపించీ కనిపెంచే తొలి -
దైవము ఎవరు ?! అమ్మ !
దేనికి సరితూగని మన -
సున్న దెవరు ?! ఒక్క అమ్మ !
బ్రహ్మ మారు రూపమమ్మ !
జీవన సర్వస్వ మమ్మ !
కపటము తెలియనిది అమ్మ !
ఏ స్వార్థము లేనిదమ్మ !
కరువు తీర్చు కల్పతరువు !
కడుపు తీపి జన్మ అమ్మ !
చిన్న నాట పూల పాన్పు
అమ్మ ఒడీ ! బడీ ! గుడీ !
*********************
రచన :---- రుద్ర మాణిక్యం (✍️కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment