భగవత్ సంబంధము*
➖➖➖
భగవత్ సంబంధమైన జ్ఞానం లౌకిక లంపటాలను నశింపజేస్తుంది. సందేహాలను నిర్మూలిస్తుంది. బలహీనలను తొలగిస్తుంది.
మనం అధిక భద్రతను ఎక్కడ పొందుతాం? ధనంలోగానీ, బాహ్యంగా లభించే విషయాలలో గానీ లేదు. అది సర్వజగత్తుకు ఆధారంగా నిలిచిన భగవంతునితో మనకు ఉన్న సంబంధంలో ఉంది.
మనకు భద్రత కల్పించేవాడు భగవంతుడు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు చేయడం అలవాటుగా చేసుకుంటారో వారే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోగలరు.
ఇలాంటి ఉన్నతమైన, ఉత్కృష్టమైన భావన కలిగి ఉన్నప్పుడు మన జీవితం, కరచరణాలు, మనోబుద్ధులు అన్నీ పరివర్తనం చెందుతాయి.
భగవత్ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అన్ని చోట్లా ఆ అనంతుడినే దర్శించగలం.`
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment