Thursday, August 1, 2024

జీవించడం ఒక కళ.*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*జీవించడం ఒక కళ.*

➖➖➖✍️

చెట్టుమీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెబుతుంది.

అది మనిషి ముందే సీతాకోకచిలుకై ఎగిరి వెళ్తుంది. మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులా ఉండిపోతోంది.

‘ఎప్పటికైనా ఎదగాలి, ఎగరాలి’

అని ప్రణాళిక సిద్ధం చేసు కోవడంతోనే మానవుడి సమయమంతా గడచిపోతోంది.

జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా బోధిస్తోంది.

అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నా- ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావడం లేదు.

ఏదో విధంగా బతకడమన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు.

బతుకు బండిని ఎలాగోలా లాగించడమన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు.

మనము ఎక్కడి నుండి వచ్చినాము? ఎందుకు వచ్చినాము? ఏమి

చేస్తున్నాం? ఏమి చేయాలి? మనము ఎక్కడికి వెళతాము? అనే ప్రశ్నలు మీలో తలెత్తి ,వాటి గురించి వివరంగా తెలియ జేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం

చేయడ మే నిజమైన జీవితం.

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.

అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..

లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది.

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు.

చీమలను చంపకుండా ఎలా?’ అని ఆలోచనలో పడ్డారు.

వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,

ఇక ఇటు రావు అని సూచించారు.

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు.

ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి....

సమస్య కొలిక్కి వచ్చింది....

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.... "మనుషులూ ఈ చీమల్లాంటివారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే

తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు..”

అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము,

మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంతా వృధా చేసుకొంటాము..

తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.

రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.

లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment