ట్రైన్ ఎక్కి ఒక అమ్మాయి తన బెర్త్ లో ఈ కుండ ముందు పెట్టి కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేసి కుండకి దణ్ణం పెట్టుకుంటుంది..
పక్కనే ఉన్న అంకులు కాశీ కి వెళ్తున్నారా అమ్మా?
ఆ అమ్మాయి లేదు అంకుల్ రాజమండ్రి వరకే అన్నది..
దానికి అంకులు ఓహ్ గోదాట్లో కలపడానీకా?? అన్నారు..
అమ్మాయి లేదు అంకుల్ ఇక్కడే తినేసి బయట పడేస్తాను అనగానే అంకుల్ బిత్తరపోయి.. ఆస్థికలు తింటావా అన్నాడు..
ఆ అమ్మాయి అంతకన్నా బిగుసుకుపోయి..
ఛీఛీ ఇవి ఆస్థికలు కాదు అండి.. నాయుడు గారి కుండ బిర్యాని అన్నది.. అంకుల్ షాక్స్.
No comments:
Post a Comment