Thursday, August 15, 2024

 🙏 *రమణోదయం* 🙏

*హృదయంలో మునిగి పంచకోశాలలోనున్న ఆత్మస్వరూపాన్ని తిన్నగా సాక్షాత్కరింపజేసుకోకుండా, లోకులు శాస్త్రవిద్యలతో చేసే పరిశోధనలు కేవలం శాస్త్ర విచారమే తప్ప "ఆత్మ విచారణ"మవుతుందా? కాదని గ్రహించు.*

వివరణ: *"తాను" పంచకోశాల లోపల ఉంది. గ్రంథాలు దానికి బయట ఉన్నాయి. కనుక పంచకోశాలను తీసేసి విచారించవలసిన "తాను" ను (ఆత్మని) గ్రంథాలలో వెదకటం వృధాయని శ్రీ భగవాన్ తమ "నేనెవరు?" అనే గ్రంథంలో సెలవిచ్చారు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.391)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment