Tuesday, September 3, 2024

 *"డబ్బూ డబ్బూ, ఎక్కడికి వెడుతున్నావు?" అని అడిగితే, "ప్రాణ స్నేహితులు అయిన ఇద్దరిని విడగొట్టడానికి వెళుతున్నాను" అందిట.*

*మనం సృష్టించుకున్న డబ్బు మనకే ఎసరు పెట్టే స్థితికి చేరుకుంది. అది డబ్బు శక్తి కాదు, మన బలహీనత.*

*అది రాను రాను తన పరిథి పెంచుకుని, తన ప్రభావాన్ని విస్తరించుకుని అన్ని బంధాలు లోనూ వైరస్ లా చొరబడి ఆడుకుంటోంది.*

*భార్యాభర్తలు అందుకేమీ మినహాయింపు కాదుగా. ఇద్దరి సంబంధమూ నిలకడగా ఉండాలంటే తగినంత డబ్బు ఉండాలి. పరస్పరం గౌరవించు కోవాలంటే డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం లో తేడా ఉండకూడదు. పర్సులు, జేబులు బరువుగా ఉంటే, మనసు తేలికగా ఉంటుంది.*

*పిల్లి పిల్లి తగువు కోతి తీర్చింది అన్నట్టు, మనకు మిగిలేది ఇరుగుపొరుగు వారు, అమ్మలక్కలు. వారికి కూడా చేరేస్తే కాస్తింత తృప్తి. ఇక్కడ ఇంటి గుట్టుకి అవకాశం తక్కువ. ఎందుకంటే, ఒకరిని నొక్కేస్తూ ఉంటేనే కదా డబ్బులు రాలేది.*🙆

*"అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మ తృఫ్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం."*🤦

*శుభోదయం.*🙏

No comments:

Post a Comment